Begin typing your search above and press return to search.

'అహంకారం, అత్యాశ కలిపితే షర్మిల'!

నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని ఆమె బజారుకు తీసుకొచ్చారని ఫైరయ్యారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:30 AM GMT
అహంకారం, అత్యాశ కలిపితే షర్మిల!
X

రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం.. జగన్ - షర్మిల ఆస్తుల తగాదా! ఇప్పుడు ఏపీలో అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇదే అంశం ట్రెండింగ్ లో నడుస్తుంది! నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ-జగన్ వర్సెస్ షర్మిల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తుంది! ఈ సమయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.

అవును... జగన్ - షర్మిల ఆస్తుల తగాదాలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న వేళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిళమ్మ అంటూ రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... షర్మిలమ్మ పుణ్యమా అని మా అన్న ఇంటి రామాయణం బజారులోకి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన రాచమల్లు... షర్మిల శత్రువులతో కలిసి, జగన్ ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని ఆమె బజారుకు తీసుకొచ్చారని ఫైరయ్యారు.

అసలు అనుబంధాలు, ఆప్యాయతల గురించి షర్మిళ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సెటైర్లు వేశారు రాచమల్లు. ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం... ఆస్తులు ఇవ్వను అని జగన్ కోర్టుకు వెళ్లారనే మాట కల్పితమని అన్నారు. షర్మిళమ్మకు జగన్ ఏమీ బాకీ లేడని తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే జగన్, షర్మిల కు సరిసమానంగా ఆస్తులు పంచారని చెప్పిన రాచమల్లు.. ఆ తర్వాత కూడా 10 ఏళ్లలో రూ.200 కోట్లు షర్మిళకు జగన్ ఇచ్చారని అన్నారు. అయితే షర్మిలకు బాకీ ఉండి జగన్ ఇది చేయలేదని, చెల్లెలు అనే అభిమానంతోనే ఎంవోయూ చేశారని తెలిపారు.

ఈ సమయంలో... జగన్ కష్టార్జితంలో పంచె ఆస్తి కోసం షర్మిళ ఆయనను బజారులోకి ఈడుస్తుందని.. అన్న ప్రేమతో ఇచ్చే ఆస్తి కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సునీతతో చేతులు కలిపి కుట్రలు చేస్తుందని అన్నారు.

అనంతరం ఆమె పాలిటిక్స్ పై స్పందించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి... తెలంగాణలో పార్టీ పెట్టి, అక్కడ అంగడి మూసివేసి, ఇప్పుడు ఏపీలో లేని పోని రాద్ధాంతం చేస్తుందని.. ఇది ముమ్మటికీ రాజశేఖర్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన విషయం కాదని.. ఇది పూర్తిగా జగన్ సొంత ఆస్తి కాజేయాలనే షర్మిళ కుట్ర అని ఫైర్ అయ్యారు.

అసలు జగన్ పై ఆమెకు ఒక్క శాతం కూడా ప్రేమా, అభిమానం లేదని.. కుటుంబ సమస్యను బజారుకు ఈడ్చి, అన్నను జైలుకు పంపాలని షర్మిల చూస్తోందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు.జగన్ ను ప్రజల్లో చెడ్డవాడిగా చిత్రీకరించేందుకు షర్మిల.. శత్రువులతో కలిసి పావులు కదుపుతోందని సంచలన ఆరోపణలు చేశారు.