బీజేపీ నాలుగో జాబితా.. టాలీవుడ్ హీరోయిన్ కు సీటు!
బీజేపీ తాజా జాబితాలో ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కు సీటు దక్కింది. తాజాగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో నటి రాధిక స్థానం చోటు దక్కించుకున్నారు
By: Tupaki Desk | 22 March 2024 10:23 AM GMTవచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ« అధిష్టానం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది.
బీజేపీ తాజా జాబితాలో ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కు సీటు దక్కింది. తాజాగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో నటి రాధిక స్థానం చోటు దక్కించుకున్నారు. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు.
కాగా.. కొద్ది రోజుల క్రితం రాధిక భర్త, ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ తన పార్టీ.. ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి (ఏఐఎస్‌ఎంకే) పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ భార్య రాధికకు బీజేపీ సీటు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాధిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్లుగా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. రాడాన్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పి పలు సూపర్ హిట్ సీరియళ్లను కూడా రాధిక నిర్మించారు.
గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితా, 9 మందితో మూడో జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 291 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.
తమిళనాడు అభ్యర్థుల జాబితా ఇదే..
తిరువళ్లూరు – పొన్. వి. బాలగణపతి
చెన్నై నార్త్ – ఆర్.సి. పాల్ కనగరాజ్
తిరువన్నామలై – ఎ. అశ్వత్థామన్
నమక్కల్ – కె.పి. రామలింగం
తిరుప్పూర్– ఎ.పి. మురుగనందం
పొల్లాచ్చి – కె. వసంతరాజన్
కరూర్ – వి.వి. సెంథిల్‌నాథన్
చిదంబరం – పి. కాత్యాయని
నాగపట్టిణం – ఎస్‌జీఎం రమేశ్
తంజావూరు – ఎం. మురుగనందం
శివలింగ – దేవనాథన్ యాదవ్
మదురై – రామ శ్రీనివాసన్
విరుధునగర్ – రాధికా శరత్ కుమార్
తెన్ కాశీ – జాన్ పాండియన్
పుదుచ్చేరి – నమశ్శివాయం