Begin typing your search above and press return to search.

అభిమానులే కాదు .. అగ్రహీరోకు కూడా తప్పలేదు

తన సతీమణి రాధిక ఎంపీగా గెలవాలని ప్రముఖ నటుడు, హీరో శరత్ కుమార్ పొర్లు దండాలు పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:11 AM IST
అభిమానులే కాదు .. అగ్రహీరోకు కూడా తప్పలేదు
X

తమ అభిమాన నాయకుడు గెలవాలని కొందరు అభిమానులు పొర్లు దండాలు, మోకాళ్ల మీద మెట్లెక్కడం గత కొన్ని రోజులుగా వార్తలలో చూస్తున్నాం. అయితే అగ్ర హీరో కూడా సామాన్యులకు అతీతం కాదని నిరూపించాడు. తన సతీమణి రాధిక ఎంపీగా గెలవాలని ప్రముఖ నటుడు, హీరో శరత్ కుమార్ పొర్లు దండాలు పెట్టుకున్నాడు.

లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు విరుద్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాధికా శరత్ కుమార్ పోటీ చేసింది. మొదటి విడత ఏప్రిల్ 19ననే అక్కడ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో రాధికా శరత్ కుమార్ దంపతులు విరుధ్‌నగర్‌లో ఉన్న శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరి కాసేపట్లో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో శరత్ కుమార్ లాంటి నటుడు కూడా పొర్లు దండాలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మరి ఎన్నికల్లో రాధిక విజయం సాధిస్తుందా ? శరత్ కుమార్ మొక్కులు ఫలిస్తాయా ? వేచిచూడాలి.