Begin typing your search above and press return to search.

ష‌ర్మిల గాలి తీసేసిన ర‌ఘువీరా రెడ్డి.. ఏం జ‌రిగిందంటే!

ఇలా ఇంత‌గా క‌ష్ట‌ప‌డిన ష‌ర్మిల వ్య‌వ‌హారంపై ప‌రోక్షంగా స్పందించిన ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి .. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   27 May 2024 3:05 PM GMT
ష‌ర్మిల గాలి తీసేసిన ర‌ఘువీరా రెడ్డి.. ఏం జ‌రిగిందంటే!
X

ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌తికించేందుకు ఫిబ్ర‌వ‌రి నుంచి ఎంతో శ్ర‌మించి.. పార్టీ కోసం క‌న్నీరు పెట్టుకుని.. సొంత అన్న ప్ర‌భుత్వా న్ని కూడా బ‌జారుకు లాగేసిన పీసీసీ చీఫ్ ష‌ర్మిల గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌పై ఆమె చాలానే ఆశ‌లు పెట్టు కుంది. క‌నీసం 15-25 అసెంబ్లీ, 2-3 పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని ఆమె ఎన్నిక‌ల‌కు ముందు ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీనికి త‌గిన‌ట్టుగానే ఆమె ప్ర‌చారం కూడా చేశారు. ఎక్క‌డికి వెళ్లినా.. ఏం మాట్లాడినా.. సీఎం జ‌గ‌న్ సెంట్రిక్‌గా .. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేంద్రంగానే మాట‌లు పేల్చారు. కొంగుచాపి ఓట్లు అడిగారు.

ఇలా ఇంత‌గా క‌ష్ట‌ప‌డిన ష‌ర్మిల వ్య‌వ‌హారంపై ప‌రోక్షంగా స్పందించిన ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి .. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం ష‌ర్మిల ప్ర‌భావం కొంత వ‌ర‌కే ప‌నిచేస్తుంద‌న్నారు. పెద్ద‌గా ఓట్లు రాబ‌డుతుంద‌ని తాను భావించ‌డం లేద‌ని చెప్పారు. ఓ ఆన్‌లైన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 సీట్లు మాత్ర‌మే ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని.. అది కూడా వైసీపీ, కూట‌మి నేత‌లు డ‌బ్బులు పంచ‌ని స్థానాలు ఏవైనా ఉంటే. అక్క‌డ మాత్ర‌మే త‌మ‌కు ఛాన్స్ ఉంద‌న్నారు. ష‌ర్మిల ప్ర‌చారం బాగానే చేశార‌ని.. అయితే.. కూట‌మి, వైసీపీ పార్టీల ప్ర‌చారం ముందు.. కొంత తేలిపోయింద‌న్నారు.

అయితే.. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల నాటికి మాత్రం ష‌ర్మిల పుంజుకునే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ర‌ఘువీరా రెడ్డి చెప్పారు. ఎన్నిక‌ల్లో ఒక్కొక్క పార్టీ రూ.8 నుంచి 10 కోట్ల రూపాలు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు త‌న‌కు అంచ‌నా ఉంద‌న్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు మంచివారైనా.. వారితో ఆర్థికంగా పోటీ ప‌డ‌లేక పోయార‌ని చెప్పారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ కొంత మేర‌కు ఓట్లు పెరిగినా.. సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. క‌డ‌ప‌లో వైఎస్ ష‌ర్మిల గెలిచే అవ‌కాశం ఉంద‌ని.. ఇక్క‌డ క్రాస్ ఓటింగ్ జ‌రిగిన‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని ర‌ఘువీరా చెప్పారు.

2009 రిపీట్‌..

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో త‌న‌కు స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయినా.. 2009లో ఉమ్మ‌డి ఏపీలో వ‌చ్చిన ఫ‌లితం మాత్రం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు కూట‌మి అయినా.. కేవ‌లం 90-100 మ‌ధ్య స్థానాల‌తోనే బొటా బొటి మెజారిటీతోనే.. అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ర‌ఘువీరా తెలిపారు. అప్పటి ఎన్నికల్లోనూ గెలిచిన పార్టీకి నామమాత్రపు మెజార్టీ వచ్చిన విష‌యాన్ని ర‌ఘువీరా గుర్తు చేశారు. ఏపీలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అంచ‌నా వేశామ‌న్నారు.