ఉత్తరాంధ్ర: రఘువర్మకే పట్టం.. కూటమి సక్సెస్ అయ్యిందా..!
ఇక, ఈ పోటీలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్టీయూ తరఫున పోటీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 Feb 2025 12:31 PM ISTఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్(ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) తరఫున పోటీలో నిలిచిన పాకాలపాటి రఘువర్మ విజయం దక్కించుకుంటారన్న సంకేతాలు వస్తున్నాయి. పోలింగ్ అనంతరం.. జరిగిన సర్వేలో మెజారిటీ ఉపాధ్యాయ ఓటర్లు.. ఆయనకే అనుకూలంగా వ్యాఖ్యానించారు. ఇక, ఈ పోటీలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్టీయూ తరఫున పోటీ చేస్తున్నారు.
అదేవిధంగా మరో ముఖ్య నేత కోరెడ్ల విజయగౌరి యూటీఎఫ్ నుంచి బరిలో ఉన్నారు. మరో ఏడుగురు స్వంతంత్రులుగా కూడా పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే కొనసాగింది. అయితే.. చివరి నాలుగు రోజులు మాత్రం కూటమిమద్దతో రఘువర్మకు సానుకూల సంకేతాలు వచ్చాయి. మంత్రు లు, నాయకులు కూడా ఆయనకు అనుకలంగా ప్రచారం దుమ్మురేపారు. ఒకవైపు సోషల్ మీడియాలోనూ.. మరో వైపు క్షేత్రస్థాయిలోనూ పర్యటించిన నాయకులు రఘువర్మకు అనుకూలంగా చక్రం తిప్పారు.
ఇక, ఓటింగ్ విషయానికి వస్తే.. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాన్ని బాగానే పుంజకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికే 86 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్పారు. ఇక, గడువు ముగిసే సమయానికిమొత్తంగా 92 శాతం పోలింగ్ నమోదైంది. దీనిని బట్టి కూటమి నాయకుల ప్రభావం ఎక్కువగానే కనిపించింది. ఇక, గాదె శ్రీనివాసులనాయుడుకు బీజేపీ నేతలు కొందరు మద్దతు ఇచ్చినా.. చివరి నిముషంలో వారు సైలెంట్ అయ్యారు.
పార్టీ అధిష్టానం కూటమికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక నాయకులు.. యూట ర్న్ తీసుకుని గాదెకు దూరంగా ఉండడం.. కూడా వర్మకు కలిసి వచ్చింది. మొత్తంగా కూటమి మద్దతుతో రఘువర్మ ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స చెబుతున్నాయి. అయితే.. పోటీ తీవ్రంగానే జరిగిందన్న సంకేతాలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. వర్మ స్వల్ప ఆధిక్యంతో అయినా.. విజయం దక్కించుకుంటారని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు.