Begin typing your search above and press return to search.

బీఆరెస్స్, నాగార్జున, సమంతపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

ప్రధానంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించే క్రమంలో సమంత-నాగ చైతన్య మధ్య విడాకుల అంశాన్ని కొండా సురేఖ ప్రస్తావించడంతో ఈ వ్యవహారం రకరకాల టర్న్స్ తీసుకుంటుంది!

By:  Tupaki Desk   |   7 Oct 2024 11:31 AM GMT
బీఆరెస్స్, నాగార్జున, సమంతపై బీజేపీ  ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
X

హైడ్రా అధికారులు ఎన్-కన్వెషన్ కూల్చివేసినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో అక్కినేని ఫ్యామిలీ, బీఆరెస్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజెపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించే క్రమంలో సమంత-నాగ చైతన్య మధ్య విడాకుల అంశాన్ని కొండా సురేఖ ప్రస్తావించడంతో ఈ వ్యవహారం రకరకాల టర్న్స్ తీసుకుంటుంది!

ఇలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు సినీ, రాజకీయ ప్రముఖులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకుని చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో... బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తాజాగా గత బీఆరెస్స్ ప్రభుత్వం, అక్కినేని కుటుంబం, సమంత తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మొదలైన విషయాలపై స్పందించారు!

అవును... ఇప్పటికే బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో... బీజేపీ నేత రఘునందన్ రావుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన రఘునందన్ రావు... నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్-కన్వెషన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేయడంపై మాట్లాడారు. ఇందులో భాగంగా... తుమ్మిడి కుంట చెరువులోని 3 ఎకరాల 30 కుంటలను ఆక్రమించి నిర్మాణం చేపట్టారని హైడ్రా ఆరోపిస్తుందని అన్నారు!

అనంతరం... తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆరెస్స్ పార్టీ ఎన్-కన్వెషన్ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్-కన్వెషన్ ఉన్న ప్రాంతాన్ని సర్వే చేయాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు 2014లోనే చెప్పిందని.. హెచ్.ఎం.డీ.ఏ. 2016లో ఈ మేరకు నివేదికను సమర్పించిందని.. 2016 నుంచి నేటి వరకూ ఎన్-కన్వెషన్ ను ఎందుకు కూలగొట్టలేదని అడిగారు!

ఇంతలో నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని.. ఆమెకు చేనేత తెలియదు, చీర తెలియదని రఘునందన్ కామెంట్ చేశారు. ఆ సంబంధాలు ఏమిటో వాళ్లే చెప్పాలని.. వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెబితేనే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.