Begin typing your search above and press return to search.

'నాగార్జునకు పదేళ్లు స్టే ఎలా?'... రఘునందన్ సంచలన వ్యాఖ్యలు!

ఈ ఘటనపై స్పందించిన నాగార్జున... ఈ కూల్చివేత కార్యక్రమం పూర్తిగా చట్ట విరుద్ధం అని అన్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 6:02 AM GMT
నాగార్జునకు పదేళ్లు స్టే ఎలా?... రఘునందన్  సంచలన వ్యాఖ్యలు!
X

సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం శనివారం ఉదయం నుంచి మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన నాగార్జున... ఈ కూల్చివేత కార్యక్రమం పూర్తిగా చట్ట విరుద్ధం అని అన్నారు. ఇదే క్రమంలో హైకోర్టును ఆశ్రయించి మధ్యతర స్టే తెచ్చుకున్నారు.

మరోపక్క హైడ్రా అధికారులు మాత్రం ఇది అక్రమ కట్టడమే అని నొక్కి చెబుతున్నారు. కూల్చివేతకు అన్ని అర్హతలూ ఉన్న నిర్మాణం అన్నట్లుగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాది కూడా అయిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, నాగార్జునకు సూటి ప్రశ్నలు స్పందించారు. హైకోర్టు ప్రస్థావనా తెరపైకి వచ్చారు!

అవును... మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ సెంటర్ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని వెంటనే కూలగొట్టేయమని సాక్ష్యాత్తు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు రఘునందన్!

"భూవివాదంలో స్టే ఇవ్వడం తప్పు కాదు కానీ... ఎన్ని రోజులు ఇస్తారు? నిజంగానే నాగార్జున చెప్పినట్లు ఎన్ కన్వెషన్ పై హైకోర్టు స్టే ఇస్తే... ఎన్ని రోజులు ఇస్తారు? 2014 నుంచి 2024 వరకూ వకీల్ బెంచ్ పైకి రానివ్వరు.. జడ్జిలు వినరు.. ఒక్కో ఫంక్షన్ కు కోటి రూపాయలు ఎన్ కన్వెషన్ వసూల్ చేసుకోవచ్చు.. నాలుగు ఎకరాల చెరువులో మట్టిపొయ్యొచ్చు.. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి" అని రియాక్ట్ అయ్యారు.

ఇదే క్రమంలో... "పదేళ్ల తర్వాత ఓ అధికారి నిద్రలేచి వచ్చి కూలగొడుతుంటే.. మళ్లీ దీనిమీద స్టే ఉంది స్టే ఉంది.. ఏమి స్టే?" అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాను కూడా జ్యుడీషియరీని ప్రశ్నిస్తున్నట్లు చెప్పిన రఘునందన్ రావు.. స్టే ఇస్తే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఏడాదియ్యి.. పదేళ్ల దాకా పిటిషన్ ఎందుకు రాలేదని అడిగారు.

ఈ నేపథ్యంలోనే... "ఎన్ కన్వెషన్ పై స్టే ఉన్నది నిజమే అయితే.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ స్టే ఎప్పుడు ఇచ్చారు.. ఇస్తే, ఆరోజు నుంచి ఈ రోజు వరకూ పిటిషన్ బెంచ్ పైకి ఎందుకు రాలేదు?.. అది రాకుండా తొక్కిపెట్టిన వకీల్ ఎవరు, రిజిస్ట్రార్ ఎవరు..? వాళ్లపై హైకోర్టు యాక్షన్ తీసుకోవాలి" అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రఘునందన్.