Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ లో ట్రిపుల్ ఆర్ దూకుడు... ఇంతలోనే మరో గుడ్ న్యూస్!

ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో అదే స్థానం నుంచి కూటమిలో ఏదో ఒక పార్టీ టిక్కెట్ పై పోటీ చేసి గెలుస్తానని చెప్పారు ట్రిపుల్ ఆర్.

By:  Tupaki Desk   |   6 Dec 2024 2:47 PM GMT
ఏపీ పాలిటిక్స్  లో ట్రిపుల్  ఆర్  దూకుడు... ఇంతలోనే మరో గుడ్  న్యూస్!
X

ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన, మాస్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న నేతల్లో ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఒకరని చెప్పినా అతిశయోక్తి కాదనే చెప్పాలి. వైసీపీ టిక్కెట్ పై నరసాపురం ఎంపీగా పోటీ చేసి, తర్వాత జగన్ తో విభేదించి, నెట్టింట రచ్చబండ ఏర్పాటు చేసి, అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన క్రెడిట్ ని సంపాదించారు!


ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో అదే స్థానం నుంచి కూటమిలో ఏదో ఒక పార్టీ టిక్కెట్ పై పోటీ చేసి గెలుస్తానని చెప్పారు ట్రిపుల్ ఆర్. అయితే.. ఆ అవకాశం లేకపోయినప్పటికీ చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ టిక్కెట్ టీడీపీ నుంచి దక్కడం.. అక్కడ ఆయన ఘన విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీటీడీ బోర్డ్ ఛైర్మన్ పదవి వరించనుందనే ప్రచారం జరిగింది.

ఇదే సమయంలో కేబినెట్ లో అయినా ట్రిపుల్ ఆర్ కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే... దీనిపై ట్రిపుల్ ఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిలో స్పందించారు కూడా! ఈ క్రమంలో... రఘురామ కృష్ణంరాజు ఏపీ అసెంబ్లీ ఉప సభాపతిగా ఎన్నికయ్యారు.. ఆ స్థానంలో ఆశీనులయ్యారు. తనదైన శైలిలో అసెంబ్లీని నడుపుతున్నారనే పేరు సంపాదించుకున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులు, అభిమానులు అర్థ సంతృప్తి చెందారనే కామెంట్లు వినిపించాయి. ఈ నిర్ణయంపై పలు రకాల కామెంట్లూ వినిపించాయి. అయితే ఆ అర్థ సంతృప్తిని పరిపూర్ణం చేసే అన్నట్లుగా ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్ కు కేబినెట్ హోదా కేటాయించబడింది.

అవును... ఉండి టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు కేబినెట్ మంత్రి హోదా ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయనకు.. ఆయన అభిమానులకు, అనుచరులకు సంతృప్తి కలిగించే నిర్ణయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!