Begin typing your search above and press return to search.

హార్ట్ టచ్చింగ్ చివరి కోరిక తీరలేదని ట్రిపుల్ ఆర్ దగ్గరకు చితాభస్మం!

తాజాగా తన 'రచ్చబండ' కార్యక్రమంతో ఎంతో మందికి దగ్గరైన ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ ని ఓ ఫ్యాన్ కోరిక టచ్ చేసింది!

By:  Tupaki Desk   |   1 Aug 2024 1:06 PM GMT
హార్ట్  టచ్చింగ్ చివరి కోరిక తీరలేదని  ట్రిపుల్  ఆర్  దగ్గరకు చితాభస్మం!
X

సినిమా నటులకు, క్రీడాకారులకు ఫ్యాన్స్ ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే... అంతకు మించి అన్నట్లుగా అతితక్కువ మంది రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు. వీరితో వారి వారి అభిమానులకు హార్ట్ టచ్చింగ్ కనెక్షన్ ఉంటుందని చెబుతుంటారు. తాజాగా తన 'రచ్చబండ' కార్యక్రమంతో ఎంతో మందికి దగ్గరైన ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ ని ఓ ఫ్యాన్ కోరిక టచ్ చేసింది!


అవును... నరసాపురం వైసీపీ (రెబల్) ఎంపీగా ఉన్న సమయంలో... ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సుమారు వారంలో ఆరు రోజులు, అప్పుడప్పుడూ ఏడు రోజులూ.. రోజూ ఒక్కో అంశంపై 'రచ్చబండ' కార్యక్రమంతో టీవీల్లో కనిపించేవారు! ఈ కార్యక్రమం ద్వారానే ట్రిపుల్ ఆర్.. రెండు తెలుగు స్టేట్స్ లోనూ వన్ ఆఫ్ ది స్టార్ పొలిటీషియన్ అయ్యారని అంటారు.


ఈ నేపథ్యంలోనే గోపీకృష్ణ అనే హైకోర్టు న్యాయవాది ఈ రఘురామ 'రచ్చబండ' కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారంట. ఈ క్రమంలోనే ఆయనను ఓ సారి వ్యక్తిగతంగా కలవాలని అనుకున్నారంట. అందుకోసం తన కుమారుడిని ఉండి ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లాలని కోరారట. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగింది.

ఇందులో భాగంగా అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో సదరు లాయర్ గోపీకృష్ణ మూడు రోజుల క్రితం మరణించారంట. ఈ సమయంలో... గోపీకృష్ణ కుమారుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా... తన తండ్రి చితాభస్మాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి ముందు రఘురామకృష్ణంరాజు వద్దకు తీసుకెళ్లాడు.

దీంతో... ఈ విషయం తెలుసుకుని ట్రిపుల్ ఆర్ చలించిపోయారని అంటున్నారు. ఈ సందర్భంగా... కొంతమందిలో మానవత్వం, ఆప్యాయత సజీవంగా ఉన్నాయని తెలిసి తాను కదిలిపోయినట్లు వెల్లడించారు. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజల గుర్తింపు, గౌరవానికి మించిన ఆనందం మరొకటి లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... హైకోర్టు న్యాయవాది అయిన గోపీకృష్ణ, తెలంగాణలోని కోదాడకు చెందిన వ్యక్తి అని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలూ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!