Begin typing your search above and press return to search.

మొదలెట్టేసిన ట్రిపుల్ ఆర్... అసెంబ్లీలో జగన్ పై సెటైర్లు!!

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2024 9:31 AM GMT
మొదలెట్టేసిన ట్రిపుల్  ఆర్... అసెంబ్లీలో జగన్  పై సెటైర్లు!!
X

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో రోజు శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగ అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యన్నపాత్రుడికి అభినందనలు తెలిపారు.. ప్రశంసల జల్లులు కురిపించారు. ఇదే క్రమంలో... అయ్యన్నపాత్రుడు స్పీకర్ అవుతున్నారని తెలిస్తే వైసీపీ అధినేత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారనే కామెంట్లూ టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రఘురామ కృష్ణంరాజు ఆసక్తికరంగా స్పందించారు. ఇందులో భాగంగా ముందుగా... "మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయ పూర్వక శుభాభినందనలు" అని చెప్పిన రఘురామ... శాసన సభ్యుడిగా మొట్టమొదటి సారి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యతిప్రాసలతో అయ్యన్నపై ప్రశంసల జల్లులు కురిపించారు.

ఇందులో భాగంగా... అసెంబ్లీలో చిన్నవారికి "అయ్య"గా.. తోటి వయస్కుల వారికి "అన్న"గా.. రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడైన “అయ్యన్నపాత్రుడి” గా పరిపూర్ణమైన పేరు సంపాదించాలని కోరుకున్నారు! ఈ సమయంలోనే సెటైర్లు స్టార్ట్ చేశారు రఘురామ!

ఈ క్రమంలో... "నిన్ననే సింహంలా చెప్పుకునే వారు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా త త త.. ప ప ప అన్నారు. ఎందుకంటే... అయ్యన్నపాత్రుడిని సభాపతిగా ఎన్నుకుంటున్నారనే అప్పుడే తెలిసిపోయింది కాబట్టి.. వారి పేరు కూడా మరిచిపోయే పరిస్థితి వచ్చింది.." అని అన్నారు. దీంతో... ఈ వ్యాఖ్యలు జగన్ ని ఉద్దేశించే అన్నారని.. రఘురామ అప్పుడే మొదలుపెట్టేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి!