బ్రహ్మ మోడీ, విష్ణుమూర్తి బాబు, పరమశివుడు పవన్... ట్రిపుల్ ఆర్ పీక్స్!
అవును... రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించిన "ప్రజాగళం" బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.
By: Tupaki Desk | 6 April 2024 4:15 AM GMTచాలా రోజుల సస్పెన్స్ తర్వత రఘురామ కృష్ణంరాజు ఏ పార్టీలో చేరబోతారనే విషయంపై క్లారిటీ వచ్చింది. పోటీ చేయబోయే నియోజకవర్గంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వీటిలో నరసాపురం లోక్ సభ స్థానంలో ఇంక అవకాశం లేదని కథనాలొస్తున్న వేళ... ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. మరో ఆప్షన్ కూడా లేకపోవడమే ఇందుకు కారణం అని అంటున్నారు. పైగా ప్రజలు తనను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారంటూ ఆయన హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే!!
ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగానే బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి ఉండి నియోజకవర్గం పేరు వినిపిస్తున్నప్పటికీ... కన్ ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది! ఈ సమయంలో అధికారికంగా టీడీపీలో చేరారు రఘురామ కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఆయన గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు, మోడీ, పవన్ ల గురించి ట్రిపుల్ ఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!
అవును... రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించిన "ప్రజాగళం" బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... జగన్ పాలనలో సొంతపార్టీ నేతలకే రక్షణ లేదని.. అందుకు ఉదాహరణ రఘురామకృష్ణంరాజే అని తెలిపారు.
ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారని.. దీంతో... ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి రాష్ట్రపతి, గవర్నర్, కోర్టుల చుట్టూ తిరిగితే బయటపడ్డారని తెలిపారు. ఈ సమయంల్మో ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు.
అనంతరం మైకందుకున్న రఘురామ కృష్ణంరాజు... గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు.. పెద్దలను కలిసి తనకు న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ఇదే సమయంలో... కూటమి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రభంజనం సృష్టిస్తున్నాం అని చెప్పిన ఆర్.ఆర్.ఆర్.... బ్రహ్మ మోడీ, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడు అని అన్నారు. ఇక మనందరం వారికి సైన్యం అని కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు.