Begin typing your search above and press return to search.

నామినేషన్ వేసే డేట్ ఫిక్స్ చేసిన రఘురామ... సీటుపై సస్పెన్స్..!

ప్రధానంగా ఎన్నికల సీజన్ మొదలైనప్పటి నుంచీ, కూటమి పార్టీలు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 April 2024 10:54 AM GMT
నామినేషన్  వేసే డేట్  ఫిక్స్  చేసిన  రఘురామ... సీటుపై సస్పెన్స్..!
X

ప్రధానంగా ఎన్నికల సీజన్ మొదలైనప్పటి నుంచీ, కూటమి పార్టీలు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వైసీపీకి ప్రత్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసేది తానే అంటూ ఇంతకాలం రఘురామ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!! అయితే... భారతీయ జనతాపార్టీ ఆ అవకాశం ఇవ్వలేదు! ఇందులో భాగంగా... బీజేపీ నేత శ్రీనివాస వర్మకు ఆ టిక్కెట్ కేటాయించారు.

ఈ సమయంలో... రఘురామ అభిమానులు తీవ్రంగా హర్ట్ అయినట్లు చెబుతుండగా.. ఆయన సైతం మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు! ఈ క్రమంలో తాజాగా ఆయన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో... రఘురామకు ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. దీంతో... ఉండి టీడీపీలో కొత్త రచ్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా రామరాజు వర్గీయులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వార్తలొచ్చాయి!

ఈ సమయంలో నరసాపురం లోక్ సభ - ఉండి అసెంబ్లీ టిక్కెట్ల ఎక్స్ ఛేంజ్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... శ్రీనివాస వర్మకు ఉండి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి, రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం లోక్ సభ స్థానాన్ని కేటాయించే ప్రయత్నాలు షురూ చేశారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన రఘురామ... తాను నామినేషన్ వేయబోయే తేదీని ప్రకటించారు. దీంతో... తనకు కేటాయించబోయే టిక్కెట్ పై రఘురామకు క్లాఇటీ ఉండి ఉండొచ్చని.. అయితే అధికారిక ప్రకటన వరకూ వేచి ఉంటున్నారని అంటున్నారు!

ఈ క్రమంలో తాజాగా పెదమీరంలో మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో తన అభిమానులు, కార్యకర్తలు తరలివస్తారనే ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు. అయితే... తాను ఏ నియోజకవర్గం నుంచి.. అసెంబ్లీకా, లోక్ సభ కా అనే విషయంపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అన్నారు. దీంతో... నామినేషన్ డేట్ సైతం ఫిక్స్ చేసేసుకున్న రఘురామకు... ఏ టిక్కెట్ కన్ ఫాం అవ్వబోతోందనేది ఆసక్తిగా మారింది.