Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ హోం మినిస్టర్ ?

రఘురామ కూడా ఈ విషయం కన్ ఫర్మ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో సీటు ఉండి అని రఘురామ అంటున్నారు

By:  Tupaki Desk   |   21 April 2024 3:52 AM GMT
ట్రిపుల్ ఆర్ హోం మినిస్టర్ ?
X

వైసీపీ రెబెల్ ఎంపీగా జనంలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న రఘురామ క్రిష్ణం రాజు నరసాపురం ఎంపీగా బీజేపీ టికెట్ మీద పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయనను చంద్రబాబు ఉండి అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దించుతున్నారు అని అంటున్నారు.

రఘురామ కూడా ఈ విషయం కన్ ఫర్మ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో సీటు ఉండి అని రఘురామ అంటున్నారు. తాను కచ్చితంగా మంచి మెజారిటీతో నెగ్గుతాను అని ఆయన చెబుతున్నారు. అంతే కాదు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

తాజాగా ఆయన ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టీడీపీ ఎమ్మెల్యేగా ముఖ్య భూమిక పోషిస్తాను అని చెప్పారు. అయితే స్పీకర్ గా మీరు కనిపిస్తారా అన్న దానికి ఆయన బదులిస్తూ అది తన అభిమానులు అనుచరులు తాను అంటే ఇష్టపడేవారు కోరుకుంటున్నారు అని నవ్వులు చిందించారు.

అదే విధంగా చూస్తే రఘురామ మనసు పెద్ద పదవుల మీదనే ఉంది అని అంటున్నారు. ఆయన మంత్రి అవుతారు అని కూడా అంటున్నారు. అపుడే శాఖల విషయం కూడా తేల్చేస్తున్నారు. రఘురామకు హోం మినిస్టర్ ఇస్తారని కూడా ప్రచారం మొదలైపోయింది.

అయితే ఈ తరహా ప్రచారాన్ని రఘురామ నవ్వుతూనే ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ తనకు టికెట్ ఇవ్వడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పులు చేసిన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. దాంతో రఘురామ మనసు హోం మినిస్టర్ మీదనే ఉంది అని అంటున్నారు.

ఇక ఉండిలో టీడీపీకి ఇద్దరు రెబెల్స్ ఉన్నారు కదా వారి వల్ల ఇబ్బంది లేదా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఏ ఇబ్బంది లేకుండా భారీ మెజారిటీతో గెలుస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తుందని చెబుతున్న రఘురామ కీలక భూమిక పోషించడం అంటే మినిస్టర్ అవుతారనే అంటున్నారు.

మరి ఇంకా చూస్తే ఆయన నామినేషన్ దాఖలు చేసి ఎమ్మెల్యేగా ప్రచారం చేయాలి. విజయం సాధించాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఆయనకు మినిస్టర్ పోస్టు ఇచ్చేది అపుడు కదా అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి అయితే ఎంపీగా పోటీ చేసే చాన్స్ తప్పింది అంటే అంతకంటే తనకు మంచి అవకాశం వచ్చింది అంటున్న రఘురామ మనసులో మంత్రి పదవి మీదనే మోజు ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.