ఆర్.ఆర్.ఆర్.. ఘన విజయం
అయినప్పటికీ.. నాయకులను కార్యక ర్తలను కలుపుకొని వెళ్లారు. ఫలితంగా.. తాజా కౌంటింగ్‌లో ఆయన 56421 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2024 4:35 PM GMTవైసీపీపై నిరంతర పోరాటం ద్వారా.. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడం ద్వారా.. నిత్యం మీడియాలో కనిపించిన కనుమూరి రఘురామకృష్ణరావు..ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్.. తాజా ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 22 రోజుల ముందు.. ఆయన బరిలోకి దిగారు. అయినప్పటికీ.. నాయకులను కార్యక ర్తలను కలుపుకొని వెళ్లారు. ఫలితంగా.. తాజా కౌంటింగ్‌లో ఆయన 56421 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.
ఎంపీ కావాలని?
కానీ, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో రఘురామరాజు ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. తాను గత 2019 ఎన్నికల్లో గెలిచిన నరసాపురం స్థానం నుంచే ఈ సారి కూడా విజయం దక్కించుకోవాలని భావించారు. అయితే.. వైసీపీతో విభేదించిన దరిమిలా.. ఆయన ఆ పార్టీకి రాం రాం పలికారు. ఈ క్రమంలో తనకు కూటమి పార్టీలైన బీజేపీ నుంచి సీటు వస్తుందని ఆశించారు. చివరి నిముషం వరకుఎదురు చూశారు. కానీ, బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కనీసం పార్టీలోకి కూడా ఆహ్వానించలేదు. దీంతో ఈ వ్యవహారం అప్పట్లో వివాదానికి కూడా దారితీసింది.
చివరకు చంద్రబాబు జోక్యంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తర్వాత.. ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి మరీ రఘురామకు టికెట్ ఇచ్చారు. అప్పటికే మంతెన రామరాజుకు ఈ టికెట్ కేటాయించారు. అయితే.. ఆయనను సైతం తప్పించి.. చంద్రబాబు రఘురామకు టికెట్ ఇచ్చారు. దీంతో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ రఘురామ తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదిలావుంటే.. ఆయన వైసీపీ తరఫున 2019లో విజయం దక్కించుకున్నారు. కానీ, స్వల్ప కాలంలోనే ఆ పార్టీతో విభేదించి.. బయటకు వచ్చారు. తర్వాత ఆయనపై సీఐడీ పోలీసులు కేసులు పెట్టడం, కొట్టడం కూడా.. వివాదానికి, న్యాయ పోరాటానికి దారి తీసింది.