Begin typing your search above and press return to search.

కొట్టినోళ్లను గుర్తు పట్టలేను కానీ... ట్రిపుల్ ఆర్ హాట్ కామెంట్స్!

నాడు లోపల ఏమి జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు కానీ... రఘురామ మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలేలా కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 July 2024 12:18 PM GMT
కొట్టినోళ్లను గుర్తు పట్టలేను కానీ... ట్రిపుల్  ఆర్  హాట్  కామెంట్స్!
X

ఆంధ్రప్రదేశ్ లో గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న తనను అరెస్ట్ చేసి కస్టడీలో హింసించారంటూ గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కిన రఘురామ... తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చేసరికి మరోసారి ఫిర్యాదు చేశారు. నాడు లోపల ఏమి జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు కానీ... రఘురామ మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలేలా కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొవాలని కోరుతూ ఆయన ఫిర్యాదు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్, సీనియర్ ఐపీఎస్ లు పీవీ సునీల్ కుమార్, పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు మీద కేసు నమోదు చేశారు. ఈ సమయంలో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాలని పట్టుబడుతూ డీజీపీ, రాష్ట్ర హోంమంత్రిని కోరారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.

అవును... ఎంపీగా ఉన్న తనను అపహరించి, చంపాలని చూశారని.. వారిని కఠినంగా శిక్షించాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు... రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి అనితను కోరారు. ఈ సమయంలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, కస్టడీలోకి తీసుకుని విచారించాలని విజ్ఞప్తి చేశారు! ఈ అందర్భంగా తన వద్ద ఉన్న ఆధారలు అన్నీ విచారణ అధికారికి అందజేస్తానని అన్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన రఘురామ... అప్పటి వైద్యులపై ఒత్తిడి చేయకుండా పోలీసులు నిఘా పెట్టాలని.. ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకూ నిందితులను బయటకు వదలొద్దని.. సాక్ష్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఇదే సమయంలో హైకోర్టు జడ్జి సమక్షంలోనే మిలటరీ ఆస్పత్రి వైద్యులు నివేదిక సిద్ధం చేశారని తెలిపారు.

ఈ క్రమంలోనే హింసించడం వల్లే తన వేలు విరింగదని, రక్తస్రావం అయ్యిందని నివేదికలో ఉందని.. ఆధారాలు ఉంటే ఎప్పుడైనా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయవచ్చని తెలిపారు. ఇదే సమయంలో... తనను కొట్టిన వారిని గుర్తుపట్టలేను కానీ... కొట్టేందుకు కుట్రపన్నింది మాత్రం వైఎస్ జగన్, సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ లే నని పునరుధ్గాటించారు.

ఈ నేపథ్యంలో... కేసును తప్పుదోవ పట్టించేందుకు సునీల్ కుమార్ ప్రయత్నిస్తున్నరని.. గత నెల 10న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదికను తారుమారు చేశారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ వివరించారు.

కాగా... రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు... ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాటి ప్రభుత్వంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన పీవీ సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతిగా వ్యవహరించిన పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, గుంటూరు ప్రభుత్వ వైద్యులు సహా మరికొంతమందిపై గుంటూరు పోలీసుల్లు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.