పవన్ "బ్రో"కు రివ్యూ ఇచ్చిన వైసీపీ ఎంపీ!
అవును... నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు "బ్రో" సినిమాపై తనదైన రివ్యూని ఇచ్చారు
By: Tupaki Desk | 29 July 2023 3:53 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ.. "బ్రో". సముద్రఖని దర్శకుడు. తమిళ మూవీ "వినోదయ సీతం"కు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిచిన సంగతి తెలిసిందే.
అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమా టాక్ సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సినిమా కచ్చితంగా చూడాలని అంటున్నారు రఘురామ కృష్ణంరాజు. అవును... ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలతో బిజీగా ఉన్న ఆయన... తాజాగా పవన్ సినిమాకి తనదైన రివ్యూ ఇచ్చారు. కచ్చితంగా చూడాలని తెలిపారు!
అవును... నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు "బ్రో" సినిమాపై తనదైన రివ్యూని ఇచ్చారు. దీన్ని మస్ట్ వాచ్ మూవీగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాని పవన్ కల్యాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరూ చూడాలని సూచించారు.
ఇదే సమయంలో.. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదనే సూత్రాన్ని ఈ సినిమా బోధించిందని రఘురామ ప్రశంసించారు. మావన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిందని వైసీపీ రెబల్ ఎంపీ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, స్క్రీన్‌ప్లే-మాటలు సమకూర్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు రఘురామ ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు.
ఇదే క్రమంలో... ఈ సినిమా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తన మిత్రుడని చెప్పిన రఘురామ... ఓ మంచి సినిమాను అందించారంటూ అభినందించారు. దర్శకుడు సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని పేర్కొన్నారు. ఫైనల్ గా ఓ మంచి చిత్రాన్ని చూశానంటూ వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు!
కాగా... భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తన గత సినిమాల్లోని కొన్ని పాటలకు పవన్ వేసిన స్టెప్పులను ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కాలం అనే దేవుడి పాత్రలో పవన్ సందడి చేయగా.. మార్క్ అలియాస్ మార్కండేయులుగా సాయిధరమ్ తేజ్ ఆకట్టుకున్నారు.