ఆర్ బీఐ గవర్నర్ గా పని చేసే వేళలో రఘరామ్ రాజన్ జీతం అంతా?
తాజాగా రాజ్ షమానీ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రఘురామ రాజన్.. ప్రస్తుత ఆర్ బీఐ గవర్నర్ జీతాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేకపోయారు.
By: Tupaki Desk | 27 Dec 2023 4:47 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉన్నప్పుడు జీతాల గురించి ఆలోచించకుండా.. తనకు తగ్గ గౌరవం దక్కిందని భావిస్తూ.. పనిలో పూర్తిగా నిమగ్నమయ్యే ప్రముఖులు కొందరు ఉంటారు. అలాంటివారు ఆ తర్వాతి రోజుల్లో తాము చేసిన పనిని.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని చెప్పనప్పుడు.. ఇలా కూడా ఉంటుందా? అన్న భావన కలుగుక మానదు. భారత్ రిజర్వు బ్యాంక్ కు గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్ తన వార్షిక జీతాన్ని వెల్లడించి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. అందుకు కారణం.. ఆయన చేతికి వచ్చిన మొత్తమే.
తాజాగా రాజ్ షమానీ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రఘురామ రాజన్.. ప్రస్తుత ఆర్ బీఐ గవర్నర్ జీతాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేకపోయారు. తాను మాత్రం ఏడాదికి రూ.4లక్షల మొత్తాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత జీతం వస్తుందన్నది తెలీదన్నారు.
ఆర్ బీఐ గవర్నర్ గా తాను పొందిన అతి పెద్ద ప్రయోజనం గురించి చెప్పిన రఘురామ్ రాజన్.. "దీరూభాయి అంబానీ ఇంటికి దగ్గర్లో ఉన్న మలబార్ హిల్స్ అనే పెద్ద ఇంట్లో నివాసాన్ని కల్పించటం అతి పెద్ద ప్రయోజనం" అని పేర్కొన్నారు. 2013 నుంచి 2016 మధ్యన ఆర్ బీఐ గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్.. క్యాబినెట్ సెక్రటరీగా సమానమైన జీతాన్ని పొందినట్లుగా పేర్కొన్నారు.
అయితే.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయనకు పెన్షన్ వంటివి రాలేదని పేర్కొన్నారు. దీనికి తోడు సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ వస్తున్న నేపథ్యంలో తనకు రాలేదేమోనని పేర్కొన్నారు. మోడీ సర్కారు కొలువు తీరిన కొంతకాలం వరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. తన పదవీ కాలం పూర్తి అయిన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. షికాగో వర్సిటీలో ప్రొఫెసర్ గా ఫుల్ టైం జాబ్ చేస్తున్నట్లుగా చెబుతారు. ఇటీవల ఆయన రాసిన పుస్తకం విడుదలైంది. మొత్తంగా చూస్తే.. భారత దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా వ్యవమరిస్తూ.. దేశ ప్రజలు వాడే కరెన్సీ మీద సంతకం ఉండే వ్యక్తికి వచ్చే నెలసరి జీతం రూ.35వేల కంటే తక్కువగా ఉండటం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.