రఘురామను తెచ్చేసుకున్నారు.. కానీ, టీడీపీ టాక్ ఏంటంటే?
కొంత మంది నాయకుల విషయంలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తుంటాయి.
By: Tupaki Desk | 6 April 2024 11:30 AM GMTకొంత మంది నాయకుల విషయంలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. బలమైన నాయకులు కావాలనే ఏ పార్టీ అయినా.. కోరుకుంటుంది. కానీ, ఆ బలం.. తమకు బలహీనత తెచ్చేదిగా మాత్రం ఉండ కూడదు. ఈ విషయంలోనే పార్టీలు ఆచి తూచి అడుగులు వేస్తుంటాయి. ఉదాహరణకు తమిళనాడులో అన్నాడీఎంకే కీలక నాయకుడు, మాజీసీఎం పన్నీర్ సెల్వం ఆ పార్టీతో విభేదించి.. బయటకు వచ్చారు. అయితే, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. దీంతో ఆయన బీజేపీ లో చేరాలని అనుకున్నారు.
నిజానికి ఆయన చేరికతో బీజేపీ బలపడుతుంది. కానీ, ఆయన గ్రాఫ్ చూసిన తర్వాత.. మోడీ అంతటి నాయకుడే .. వద్దులే అనే శారు. అయితే.. ఆయనకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఎన్డీయే యూటమిలో ఒంటరిగానే ఆయనను చేర్చుకున్నారు. ఆయనకు పార్టీ కూడా లేదు. అయినా.. ఆయన ఎన్డీయే తరఫున ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తున్నారు. కట్ చేస్తే.. ఇలాంటి మనస్తత్వానికి ఏమాత్రం తీసిపోని నాయకుడిగా ఏపీ పేరు తెచ్చుకున్న వైసీపీరెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును చంద్రబాబు టీడీపీలోకి తీసుకున్నారు.
అయితే.. ఆయన వల్ల పార్టీకి ఒరిగేది ఏమో కానీ.. ఆయన ఆధిపత్య ధోరణి.. పార్టీకి సెగ పుట్టిస్తుందనేది క్షత్రియ సామాజిక వర్గంలోనే వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. క్షత్రియ సామాజిక వర్గంలో దాదాపు 40-50 శాతం ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో నరసాపురంలో టీడీపీ నాలుగు లక్షల ఓట్లు పడ్డాయి. ఇవన్నీ దాదాపు క్షత్రియ సామాజిక వర్గం ఓట్లే. కానీ, వీరిలోనే రఘురామపై వ్యతిరేకత ఉంది. ఒక పార్టీలో టికెట్ తెచ్చుకున్నాక.. ఆ పార్టీపైనే తిరుగుబాటు చేయడాన్ని క్షత్రియులు నిరసించారు. గతంలోనూ .. ఇలానే పార్టీలు మారిన వారికి ఇక్కడ చుక్కలు చూపించారు.
ఇప్పుడు రఘురామ విషయాన్ని తీసుకుంటే.. మీడియా ముందు మాత్రమే పులి మాదిరిగా వ్యవహరించారు తప్ప.. నియోజకవర్గంలో ఆయన కనిపించింది.. చేసింది కూడా ఏమీలేదనే టాక్ ఉంది. ఇప్పుడు ఇలాంటి నాయకుడిని తీసుకుని.. టీడీపీ ఏం చేస్తుందన్నది ప్రశ్న. మరోవైపు.. రఘురామ వంటి నాయకుడికి ఇప్పుడు టికెట్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరినో ఒకరిని.. పోటీ నుంచి తప్పించాలి. ఇది మరింతగా కాకపుట్టిస్తుందనే చర్చ సాగుతోంది. అలా కాకుండా.. ఆయనను స్టాండ్‌బైలోనే ఉంచిప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు పంపించి ఉంటే బాగుండేదనే చర్చ టీడీపీలోనే సాగుతుండడం గమనార్హం.