వీడియో: ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ తీవ్ర వాగ్వాదం
రోడ్డు పక్కన కార్ ఆపిన రాహుల్ ద్రవిడ్ తన మాతృభాష కన్నడలో డ్రైవర్‌తో వాదిస్తూ కనిపించారు.
By: Tupaki Desk | 5 Feb 2025 3:57 AM GMTభారత దిగ్గజ క్రికెటర్- టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం సాయంత్రం బెంగళూరు వీధుల్లో ఆటోరిక్షా డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. రోడ్డు పక్కన కార్ ఆపిన రాహుల్ ద్రవిడ్ తన మాతృభాష కన్నడలో డ్రైవర్‌తో వాదిస్తూ కనిపించారు. అయితే ఈ వాగ్వాదానికి కారణం.. ద్రవిడ్ కారు గూడ్స్ ఆటోను ఢీకొట్టింది. అనంతరం ఆటో డ్రైవర్- ద్రవిడ్ మధ్య నడివీధిలో వాగ్వాదం జరిగింది. అయితే ఆటో ఢీకొట్టిన సమయంలో ద్రవిడ్ తన కారును నడుపుతున్నారా లేదా అనేదానిపై స్పష్ఠత లేదు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం...బెంగళూరులోని రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్ రోడ్డులో సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద ద్రవిడ్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఆటో డ్రైవర్ తన కారును వెనుక నుండి ఢీకొట్టాడని చెబుతున్నారు. సంఘటన స్థలం నుండి బయలుదేరే ముందు ద్రవిడ్ ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్ ను తీసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని టైమ్స్ తన కథనంలో పేర్కొంది. వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
ద్రవిడ్ (52) టీమిండియా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో 24,000 పరుగులు సాధించాడు. 2007 ప్రపంచ కప్‌లో ద్రావిడ్ భారతదేశానికి కెప్టెన్ గా ఉన్నారు. భారత జట్టుకు ద్రవిడ్ ఇటీవల ప్రధాన కోచ్‌గా పనిచేశారు. భారతదేశం టి 20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత జూలైలో అతని పదవీకాలం ముగిసింది. ఆ టోర్నీ తర్వాత ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ (RR)కి తిరిగి వచ్చి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతను ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్‌తో పాటు పాల్గొన్నాడు. వేలం చరిత్రలో అతి పిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేయడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు వార్తల్లో నిలిచింది.