బహుజనుల బాటలో రాహుల్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 2014 మాదిరిగా అనుకుంటూ ఎన్నికలకు వెళ్ళిన ఎన్డీయే కూటమి బొక్క బోర్లా పడింది.
By: Tupaki Desk | 8 Oct 2024 3:44 AM GMTకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 2014 మాదిరిగా అనుకుంటూ ఎన్నికలకు వెళ్ళిన ఎన్డీయే కూటమి బొక్క బోర్లా పడింది. ఈ మాట ఎందుకు అంటే ఎన్డీయే కూటమి 400 సీట్లను టార్గెట్ గా చేసుకుంది. బీజేపీకి సొంతంగా 370 అని ఫిగర్ ఫిక్స్ చేసింది.
అయితే బీజేపీకి సొంతంగా 240 మాత్రమే వచ్చాయి. ఇక ఇండియా కూటమితో సర్దుబాటు చేసుకుని తక్కువ సీట్లకే పోటీ చేసినా వంద సీట్లను సాధించి నిష్పత్తిలో బీజేపీ కంటే ఎక్కువగానే సక్సెస్ కొట్టినట్లు అయింది. ఇదంతా ఎలా జరిగింది అంటే కాంగ్రెస్ పోయిన చోట వెతుక్కుంటోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశంలో చేసిన పాదయాత్ర పార్టీకి ఎంతో బూస్టప్ ఇచ్చింది. అదే సమయంలో రాహుల్ ని కూడా బాగా మార్చింది. ఆయన అణగారిన వర్గాలు బహుజనుల మద్దతుని పొందేందుకు ఈ యాత్ర బాగా హెల్ప్ చేసింది.
రాహుల్ కుల గణన నినాదం కూడా ఇక్కడ నుంచే పుట్టుకుని వచ్చింది. బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ రాజకీయాలకు మధ్య అతి పెద్ద విభజన గీతను గీసి నూటికి తొంబై శాతం వర్గాల కోసం కాంగ్రెస్ అని క్లెయిం చేసుకుంటున్నారు. కుల గణన విషయంలో బీజేపీ ఎందుకు మొగ్గు చూపడం లేదో అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు.
దేశంలో ఫలానా వర్గాలు ఇంత సంఖ్యలో ఉన్నారు అంటే అలా బయటకు తెలియడం వల్ల వారికి మరిన్ని స్కీములను అందిస్తూ వారి అభ్యున్నతి మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టవచ్చు కదా అన్నది కూడా ఉంది. ఇక రాహుల్ గాంధీ ఇతర వర్గాలను అన్నీ కలుపుకుంటూ ముందుకు పోతున్నారు.
కాంగ్రెస్ కి ఒకనాడు దళిత వర్గాలను దూరం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఇపుడు తనకు తానుగా ఇబ్బందులు పడుతోంది. ఇటీవల జరిగిన యూపీ లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ఇపుడు కావాల్సినంత స్కోప్ అయితే కాంగ్రెస్ కి కనిపిస్తోంది.
యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాలలో బీసీల ఓట్లను షేర్ చేసుకోవడానిక్ లాలూ పార్టీ అఖిలేష్ ఎస్పీ పార్టీలు ఉన్నాయి. దళిత ఓట్లను సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. వారి తరఫున రాహుల్ ఎక్కువగా మాట్లాడుతున్నారు
తాజాగా ఆయన మహారాష్ట్ర పర్యటనలో కొళాపూర్ లోని దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో వంట వండి అక్కడే భోజనం చేశారు. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. గాంధీ వంశీకుడు, దేశంలో ఒక గ్రాండ్ ఓల్డెస్ట్ పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు అయిన రాహుల్ అలాగే ఫ్యూచర్ ప్రధానిగా విశ్లేషకులు చెబుతున్న రాహుల్ అలా ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్లడం అంటే ఇది ఆయన రాజకీయ పరిణతిని ఆయనలోని నాయకత్వ పటిమను తెలియచేస్తోంది అని అంటున్నారు.
ఇక రాహుల్ ఆ ఇంటి వారి సమస్యలను తెలుసుకున్నారు. దళిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా రచయిత షాఊ పటోలేతో కలసి రాహుల్ కూరగాయల వంటకం చేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో ఆయన ట్వీట్ చేస్తూ ఈనాటికీ దేశంలో ఎక్కడా దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అన్నారు. పటోలే చెప్పినట్లుగా అయితే దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు అని అన్నారు. వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసమే ఇలా చేశాను అని చెప్పారు.
ఈ విధంగా రాహుల్ సామాజిక అంశాల మీద స్పందించే అగ్ర రాజకీయ నేతగా ముందుంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన ఇటీవల కాలంలో చెప్పులు కుట్టారు. బహుజనుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడారు, వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ కి పోయిన బలాన్ని తిరిగి తెచ్చే చర్యలుగానే అంతా భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఈ విధంగా పేదలతో బీదలతో బడుగులతో బహుజనులతో కలిసిపోవడానికి ఆ విధంగా ఆయన చొరవ చేయడానికి కారణం మాత్రం ఆయన సుదీర్ఘంగా చేసిన పాదయాత్ర అని చెప్పాల్సి ఉంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ అత్యధిక బహుజనులు ఉన్న ఈ దేశానికి ఒక నేతగా వారికి ఒక ఆశాకిరణంగా ఎదిగే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు అని అంటున్నారు.