Begin typing your search above and press return to search.

రాహుల్ ని లైట్ తీసుకుంటున్నారా ?

ఆయన గాంధీల కుటుంబానికి చెందిన ఐదవ తరం వారసుడు అన్నది ప్లస్ కంటే మైనస్ గానే మారుతోంది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 3:42 AM GMT
రాహుల్ ని లైట్ తీసుకుంటున్నారా ?
X

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గత రెండు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ జీవితంలో తన శక్తికి మించి పనిచేస్తున్నారు. వీలున్న చోటల్లా తన నాయకత్వ పటిమను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు కాలం కలిసి రావడం లేదు.

ఆయన గాంధీల కుటుంబానికి చెందిన ఐదవ తరం వారసుడు అన్నది ప్లస్ కంటే మైనస్ గానే మారుతోంది. కాంగ్రెస్ వారసత్వం ఆయనకు గుదిబండగా అయిందని తెలిసే ఆయన ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరహించలేదు. దానికి మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు.

తాను కూడా ఒక నాయకుడిని మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ జనంతో మమేకం అవుతున్నారు. భారత్ జోడో యాత్రను చేపట్టారు. కాంగ్రెస్ సీట్లను లోక్ సభలో సెంచరీకి చేర్చారు. అయితే ఇది చాలదు ఇంకా కావాల్సి ఉంది. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి చెందడంతో కాంగ్రెస్ సోలోగా హిట్లు కొట్టాలి. రాహుల్ నుంచి మెరుపు షాట్లను అంతా ఆశిస్తున్నారు.

ఆయన లీడర్ షిప్ కి మరింతగా మన్నన దక్కాలని పార్టీ లోపలా బయటా అంతా కోరుకుంటున్నారు. మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ వ్యూహాలను సైతం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అన్న వారూ ఉన్నారు. ఆయన నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ద్వయాన్ని ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సాధించిన స్కోర్ ఎంత అన్నది కూడా ఎపుడూ డిస్కషన్ పాయింట్ గానే ఉంటుంది.

ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ ఇండియా కూటమిని నాయకత్వం వహిస్తున్నారా అంటే అవును అనే చెప్పాలి. ఆయన లోక్ సభలో అపోజిషన్ లీడర్ గా ఇండియా కూటమికి ఉన్నారు మొత్తం 240 దాకా ఇండియా కూటమి సీట్లు సాధించింది. దాంతో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా కేవలం కాంగ్రెస్ కే కాదు ఇండీ కూటమికి కూడా అన్నది ఉంది.

అయితే మేమంతా ఒక్కటే అంటూ మోడీ అదానీలను విమర్శిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్ లో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు మమతా బెనర్జీ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ కానీ అలాగే అఖిలేష్ నాయకత్వంలోని ఎస్పీ పార్టీకి చెందిన ఎంపీలు కానీ పాలు పంచుకోలేదు.

ఇలా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ నాయకత్వాన్ని విభేదిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పెశారు. ఇదంతా మనతా బెనర్జీ ప్రకటనల ప్రభావమా అంటే అన్నీ కలిపే అని చెప్పాలి. ఇండియా కూటమిని సమర్ధ నాయకత్వం ఉండాలని ఇటీవల కాలంలో పదే పదే మమత ఇస్తున్న ప్రకటనల కారణంగా ఇలా లోక్ సభలో జరిగిందా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు.

రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యం అంటూ ఇండీ కూటమి నేతలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తున్న విమర్శలతో రాహుల్ జీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అని అంటున్నారు. వాళ్ళకు చేతకాకపోతే నేనే ఇండియా కూటమిని నడిపిస్తాను అని మమతా బెనర్జీ అన్న మాటలను కూడా ఈ సందర్భంగా చూడాల్సి ఉంది. అలాగే మమతా బెనర్జీ ఇండీ కూటమికి లీడర్ గా సమర్ధురాలు అంటూ మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ రాహుల్ గాంధీకి పంచ్ ఇచ్చేశారు. ఇంకో వైపు చూస్తే ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు చూపిస్తోంది. ఇండియా కూటమి వైపు నుంచి దూరం అయింది.

హర్యానా మధ్యప్రదేశ్ వంటి చోట్ల ఎన్నికల్లో తమకు అవకాశాలు ఇవ్వలేదని వామపక్షాలు కూడా కాంగ్రెస్ మీద రాహుల్ మీద గుర్రు మీద ఉన్నాయి. మరి ఇవన్నీ చూసినపుడు రాహుల్ గాంధీ నాయకత్వం సంక్షోభంలో పడుతోందా ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయా అంటే ఆ కోణంలో సీరియస్ గానే ఆలోచించాల్సి ఉంది.

అయితే రాహుల్ గాంధీ యాంటీ మోడీ స్టాండ్ బలంగా తీసుకుంటున్నారు. ఆయన పార్లమెంట్ లో ఒకే అంశం మీద పట్టుబడుతూ సభను స్తంభింప చేస్తున్నారు అన్న విమర్శలూ ఉన్నాయి. పార్లమెంట్ అంటే దేశంలోని అనేకమైన ప్రజా సమస్యలకు కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతీకగా చూడాల్సి ఉంది.

ప్రతిపక్షంలో ఉన్న వారు ఘర్షణ వైఖరితోనూ ఉండాలి కొన్ని విషయాల్లో ఇచ్చి పుచ్చుకునే విధంగానూ ఉండాలి. ఇది రాహుల్ వద్ద కనిపించడం లేదా అన్న చర్చ కూడా ఉంది. పార్లమెంట్ ని స్తంభింప చేస్తే అధికార పార్టీకే మేలు జరిగినట్లు అవుతుంది. అలా కాకుండా అన్ని ఇష్యూని ని సభలో పెట్టి చర్చించినపుడే విపక్షానికి రాణింపు గుర్తింపు వస్తాయి. అదానీ మోడీ ఒక్కటి అన్నది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వరకూ ఓకే అయినా దానినే పట్టుకుని కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ నాయకుడిగా తనను తాను రుజువు చేసుకునే క్రమంలో పదవులను కూడా సవాల్ గా స్వీకరించాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన కాదనడం ద్వారా తాను బలహీన నేతను అని కోరి సంకేతాలు ఇచ్చారా అన్నది కూడా ఉంది. ఇండియా కూటమి సారధ్యం విషయంలో వస్తున్న విమర్శలు ఇస్తున్న ప్రకటనల మధ్య రాహుల్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి సొంత కూటమిలో ప్రత్యర్ధులను దారికి తెచ్చుకునే కార్యక్రమం గురించి ఆలోచించాలని అంటున్నారు.