మోడీ విమానంలో సాంకేతిక లోపం.. రాహుల్ హెలీకాప్టర్ కు క్లియరెన్స్ జాప్యం!
జార్ఖండ్ లోని దేవగఢ్ విమానాశ్రయం నుంచి మోడీ ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అవ్వాల్సి ఉండగా ఈ సమస్య ఏర్పడింది.
By: Tupaki Desk | 15 Nov 2024 10:54 AM GMTభారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని తిరిగి హస్తినకు వచ్చే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని అంటున్నారు. జార్ఖండ్ లోని దేవగఢ్ విమానాశ్రయం నుంచి మోడీ ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అవ్వాల్సి ఉండగా ఈ సమస్య ఏర్పడింది.
అవును... ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో.. దేవగఢ్ ఎయిర్ పోర్ట్ లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఈ సాంకేతిక సమస్య పరిష్కారం అయిన తర్వాత మోడీ తిరిగి పయనమవుతారా.. లేక, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
కాగా.. ఆదివాసీ వీరుడు బిర్సా ముండాను సన్మానించే సందర్భంగా తో పాటు జంజాతీయ గౌరవ్ దివస్ ను పురస్కరించుకుని జరిగే వేడుకల్లో భాగంగా జార్ఖండ్ లో జరిగిన రెండు ర్యాలీల్లోనూ ప్రధాని ప్రసంగించారు. ఈ సమయం లో తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
మరోపక్క... ఎన్నికల సంబంధిత కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జార్ఖండ్ కు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెలీకాప్టర్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయింది. రాహుల్ బహిరంగ సభలో ప్రసంగించాల్సి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో... ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ జాప్యం రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నారు. ఇది బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవడమే అని ఫైరవుతున్నారు. అయితే... బీహార్ లో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ కారణంగా రాహుల్ హెలీకాప్టర్ కు క్లియరెన్స్ ఆలస్యం అయ్యిందని.. ఆ ప్రాంతంలో గగనతలం అందుబాటులో లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాని తెలుస్తోంది!