కాంగ్రెస్ తప్పులు చేసింది... రాహుల్ కోపం ఎవరి మీద?
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 11 May 2024 11:03 AM GMTకాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని అన్నారు. ఆ తప్పులు సరిదిద్దుకునే సమయం కూడా వచ్చిందన్నారు. అయితే.. కీలకమైన ఎన్నికల వేళ.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మోడీ ప్రభావంతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌కు అంతో ఇంతో ఆక్సిజన్ ఇవ్వాల్సిన రాహుల్.. సొంత పార్టీనే తప్పులు చేసిందని చెప్పడం ద్వారా.. ప్రత్యర్థి పక్షాలకు మరిన్ని ఆయుధాలు అందించినట్టే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్తితి చావో రేవో అన్నట్టుగా మారింది. బీజేపీ దూకుడు, ఆ పార్టీ అగ్రనాయకుల వ్యూహాల ముందు కాంగ్రెస్ తేలిపోతోంది. అంతేకాదు.. బీజేపీకి బలమైన వాయిస్ ఉంది. బలమైన నాయకులు కనిపిస్తున్నాయి. దేశాన్ని చుట్డేస్తున్నారు. ఇటువైపు కాంగ్రెస్‌ను చూసుకుం టే.. బలమైన నాయకుల కొరత స్పష్టంగా ఉంది. ఇక, ఉన్న కొద్ది మంది నాయకులు కూడా.. సీబీఐ, ఈడీ దెబ్బతో సైలెంట్ అయిపోయి.. తమతమ నియోజకవర్గాలను కాపాడుకునే పనిలో పడ్డారు.
దీంతో సీనియర్ల ప్రభావం.. దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్లు వంటివి కాంగ్రెస్‌కు లేకుండా పోయాయి. రాహుల్ గాంధీ ఒక్కరే ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. అయినప్పటికీ.. పెద్దగా జోష్ కనిపించడం లేదు. ఏదో ఒకింత మైలేజీ వస్తుందిలే అని ఆయన ప్రయత్నం చేసినప్పుడల్లా.. ఎవరో ఒకరు సీనియర్ నాయకుడు చేస్తున్న కామెంట్లతో అప్పటి వరకు చేసిన ప్రయత్నాలు మట్టి పాలవుతున్నాయి. శ్యామ్ పిట్రోడా, శశిథరూర్, మణిశంకర్ అయ్యర్.. ఇలా కొందరు సొంత వివాదాలు సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ విసిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు సోనియాగాంధీ కూడా.. యాక్టివ్‌గా లేకపోవడం.. చెల్లెలు యూపికే పరిమితం కావడంతో మొత్తం బాధ్యతంతా కూడా.. రాహుల్‌పైనే పడడడం సీనియర్ల సహకారం కొరవడిన నేపథ్యంలో గతాన్ని తొవ్వుతూ.. కాంగ్రెస్ తప్పులు చేసిందని.. అంటే.. అర్హత లేనివారిని చేరదీసిందనే కోణంలో రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటే కోపం ఉన్నా.. ఇప్పటికిప్పుడు చేసే పరిస్థితి లేదు. మరి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూడాలి.