Begin typing your search above and press return to search.

అమేథీ వైపు రాహుల్ చూపు !

2004 నుంచి 2019 వ‌ర‌కు రాయ్ బరేలి నుండి సోనియాగాంధినే గెలుపొందారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

By:  Tupaki Desk   |   25 April 2024 11:30 PM GMT
అమేథీ వైపు రాహుల్ చూపు !
X

వాయనాడ్ గెలుపుపై రాహుల్ గాంధీకి అనుమానాలు నెలకొన్నాయా ? ఈ నెల 26తో వాయనాడ్ లో ఎన్నికల పోలింగ్ ముగియనుండడంతో అదే రోజు నుండి అమేథిలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 30 వరకు యూపీలోని అమేథీ నుండి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుండి ప్రియాంక గాంధీలను అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

రాయ్ బరేలి నుండి ప్రియాంక, అమేథి నుండి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలని ఇటీవల పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో తాజాగా రాహుల్, ప్రియాంక బరిలోకి దించనున్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

2004 నుంచి 2019 వ‌ర‌కు రాయ్ బరేలి నుండి సోనియాగాంధినే గెలుపొందారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. దీంతో రాయ్‌బ‌రేలీ నుంచి ఈసారి ప్రియాంకను బ‌రిలోకి దించనున్నట్లు స‌మాచారం.

అమేథిలో 2004 నుంచి వ‌రుస‌గా మూడుసార్లు రాహుల్ ఎన్నిక‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓట‌మి పాల‌య్యాడు. ఆ ఎన్నిక‌ల్లో రాహుల్ వ‌య‌నాడ్ నుంచి గెలుపొందాడు.

ప్రస్తుతం వాయనాడ్ లో గెలుపుపై అపనమ్మకం నేపథ్యంలో తిరిగి అమేథి నుండి పోటికి దిగాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది.

అమేథి, రాయ్‌బ‌రేలీ ఎంపీ స్థానాల‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేదీ మే 3. ఈ నేపథ్యంలో నామినేషన్లకు ముందు రాహుల్, ప్రియాంక అయోధ్యలో బాల‌రాముడిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తల్లి విజయాలను ప్రియాంక కొనసాగిస్తుందా ? అమేథిని రాహుల్ తిరిగి చేజిక్కించుకుంటాడా ? వేచిచూడాలి.