Begin typing your search above and press return to search.

ఒక కుక్క‌-రెండు బిస్క‌ట్లు.. రాహుల్ వ‌ర్సెస్ బీజేపీ!

ప్ర‌స్తుతం రాహుల్ పాద‌యాత్ర‌.. జార్ఖండ్‌లో సాగుతోంది. ఈ స‌మ‌యంలో పార్టీ అభిమాని ఒక‌రు.. ఈ యాత్ర‌లో పాల్గొన్నారు

By:  Tupaki Desk   |   7 Feb 2024 3:01 AM GMT
ఒక కుక్క‌-రెండు బిస్క‌ట్లు.. రాహుల్ వ‌ర్సెస్ బీజేపీ!
X

హెడ్డింగ్ చూస్తే.. ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది. కానీ, నిజ‌మే. కుక్క‌పిల్ల.. స‌బ్బుబిళ్ల‌.. కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అని శ్రీశ్రీ అన్న‌ట్టుగానే.. బీజేపీకి కూడా రాజ‌కీయం చేసేందుకు కుక్క‌పిల్ల‌ల‌ను కూడా వినియోగించేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఏదో ఒక విధంగా డ్యామేజీ చేయాల‌నే సంక‌ల్పంతో ఉన్న బీజేపీనేతలు.. ఆయ‌న చేస్తున్న భార‌త్ జోడా న్యాయ యాత్ర‌పై కాంగ్రెస్ నేత‌ల క‌న్నా కూడా.. ఎక్కువ‌గానే దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ నేత‌ల‌కు కుక్క క‌నిపించింది. దీనిని అడ్డు పెట్టుకునిరాహుల్‌పై విమ‌ర్శ‌లు చేసింది. దీనికి రాహుల్ కూడా గ‌ట్టిగానే జ‌వాబు చెప్పార‌నుకోండి.


ప్ర‌స్తుతం రాహుల్ పాద‌యాత్ర‌.. జార్ఖండ్‌లో సాగుతోంది. ఈ స‌మ‌యంలో పార్టీ అభిమాని ఒక‌రు.. ఈ యాత్ర‌లో పాల్గొన్నారు. అయితే.. ఆయ‌న త‌న వెంట త‌న కుక్క‌పిల్ల‌ను కూడా తీసుకువ‌చ్చారు. ఇది బొద్దుగా ముచ్చ‌ట‌గా ఉండ‌డంతో రాహుల్ క‌న్ను ఈ కుక్క‌పై ప‌డింది. వెంట‌నే దానినిద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. అదేస‌మ‌యంలో త‌న వారితో చెప్పి.. దానికి బిస్క‌ట్లు తీసుకురావాల‌ని ఆదేశించారు. దీంతో వారు కుక్క‌లకు ప్ర‌త్యేకంగా ఉండే బిస్క‌ట్ల‌ను తీసుకువ‌చ్చి ఇచ్చారు. వీటిలో రెండు బిస్క‌ట్ల‌ను రాహుల్‌.. త‌న చేత్తో తీసి..కుక్క‌కు తిన‌పించ‌బోయారు. అయితే.. ఆ కుక్క బెదిరిపోయిందో ఏమో.. బిస్క‌ట్లు వాస‌న చూసి వ‌దిలేసింది.

దీంతో రాహుల్‌.. వెంట‌నే కుక్క య‌జ‌మాని, పార్టీ కార్య‌క‌ర్త‌కు.. అవే బిస్క‌ట్లు చేతికి అందించి.. ''నువ్వు తినిపించు'' అని అన్నారు. దీంతో స‌ద‌రు కార్య‌క‌ర్త‌.. త‌న కుక్క‌కు ఆ రెండు బిస్క‌ట్లు తినిపించారు. ఆ కుక్క చొంగ‌కార్చుకుంటూ.. ఆ బిస్క‌ట్లు ఆబ‌గా తినేసింది. ఇదే.. బీజేపీ కార్న‌ర్ చేసింది. ఒక వీడియోను పోస్ట్ చేసింది. రాహుల్ తన మద్దతుదారులను కుక్కల్లా చూస్తున్నారంటూ ఆక్షేపించింది.(కుక్కు తినిపించాల‌ని రెండు బిస్క‌ట్లు కార్య‌క‌ర్త‌కు ఇవ్వ‌డాన్ని)

అయితే.. ఇది భారీ ఎత్తున వైర‌ల్ కావ‌డంతో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. `కార్య‌క‌ర్త‌కు బిస్క‌ట్ ఇవ్వ‌లేదు, ఆయన కాంగ్రెస్ కార్యకర్త అని తెలియ‌దు. కుక్కల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో నాకు అర్ధం కావడం లేదు. కుక్కలు వాళ్లకు ఏమి హాని చేశాయి. పప్పీకి బిస్కెట్లు తినిపిద్దామనుకుంటే అది కొంత నెర్వస్‌గా, భయంగా కనిపించింది. దాంతో పప్పీ యజమానికే ఆ బిస్కెట్లు ఇచ్చా. అతను తినిపించగానే పప్పీ ఆప్యాయంగా వాటిని తింది. ఇందులో సమస్య ఏముంది`` అని రాహుల్ ప్ర‌శ్నించారు.