Begin typing your search above and press return to search.

ఈసారి రాహులే పెళ్లి మాట ఎత్తాడు బాస్.. ఎవరితోనంటే?

కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:05 AM GMT
ఈసారి రాహులే పెళ్లి మాట ఎత్తాడు బాస్.. ఎవరితోనంటే?
X

కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాలెండర్లకు క్యాలెండర్లు మారిపోతున్నా.. రాహుల్ గాంధీ పెళ్లి స్టేటస్ లో మాత్రం ఎలాంటి మార్పు రాని విషయం తెలిసిందే. ఆయన ఎక్కడకు వెళ్లినా.. అక్కడి వారు అడిగే ప్రశ్నల్లో..ఆయన పెళ్లి గురించి ఒక ప్రశ్న పక్కాగా ఉంటుంది. ఇలా అలవాటైన తీరుకు భిన్నంగా రాహుల్ వ్యవహరించారు. తాజాగా కశ్మీర్ కాలేజీ అమ్మాయిలతో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఎప్పుడూ తాను ఎదుర్కొనే పెళ్లి ముచ్చటను.. ఆయనే ప్రస్తావించటం విశేషం.

కశ్మీరీ కాలేజీ అమ్మాయిలతో మాట్లాడిన రాహుల్ వారిని ఉద్దేశించి.. ‘‘పెళ్లి చేసుకోవటంపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందా?’’ అని ప్రశ్నించారు. దీనికి రియాక్టు అయిన కశ్మీరీ యువతులు రాహుల్ పెళ్లి ముచ్చటను ప్రశ్న రూపంలో సంధించారు. ‘‘ఇంతకూ మీ పెళ్లి ఎప్పుడు?’’ అంటూ రాహుల్ ను ప్రశ్నించారు.

దీనికి సమాధానం ఇచ్చిన రాహుల్.. తాను ఇరవై - ముప్ఫై ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ సమాధానాన్ని నవ్వుతూ ఇవ్వటం గమనార్హం. పెళ్లికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటివేమీ లేవన్న ఆయన.. పెళ్లిని తోచిపుచ్చటం లేదన్నారు. ఈ సందర్భంగా కశ్మీరీ అమ్మాయిలు రాహుల్ ను ఒక కోరిక కోరారు. తన పెళ్లి ఫిక్స్ అయితే.. వివాహానికి తమను కూడా పిలుస్తారా? అని ప్రశ్నించగా.. తప్పకుండా పిలుస్తానంటూ రాహుల్ హామీ ఇవ్వటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయబరేలీలో ప్రచారానికి వెళ్లగా.. అక్కడి వారు పెళ్లి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా పెళ్లి త్వరగా చేసుకోవాలన్న మాట రావటంతో.. ఈ అంశం పెను ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి రోటీన్ కు భిన్నంగా రాహుల్ తానే పెళ్లి గురించి మాట ఎత్తటం విశేషంగా చెప్పక తప్పదు.