Begin typing your search above and press return to search.

ఏ కులమూ నీదంటే...రాహుల్ వర్సెస్ బీజేపీ !

భారత్ అగ్ర దేశంగా మారుతుందని ఏలికలు భరోసా ఇస్తున్నారు. వికసిత భారతం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 4:11 AM GMT
ఏ కులమూ నీదంటే...రాహుల్ వర్సెస్ బీజేపీ !
X

ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది అని ఒక పాత పాట ఉంది. అది సనాతన కాలంలో కుల వైషమ్యాల గురించి విమర్శనాత్మక ధోరణలో రాసిన పాట. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు పై దాటింది. భారత్ అగ్ర దేశంగా మారుతుందని ఏలికలు భరోసా ఇస్తున్నారు. వికసిత భారతం అని అంటున్నారు.

అయినా కులం గోడలను దాటుకుని సమాజం ముందుకు కదలడం లేదు. రాజకీయాలకు కులానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అది కేవలం ఎన్నికల్లో మాత్రమే కాదు నిరంతరం కూడా సాగుతూనే వస్తోంది. దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ లోనే కులాల గొడవలు ప్రస్తావన రావడం అంటే ఒకింత బాధాకరమే అయినా దాని వెనక రాజకీయ కోణాలు చూసిన వారికి ఇది సహజమే అన్న భావన కలుగుతుంది.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెనక బీసీలు ఆదీవాసీలు ఇతర బలహీన వర్గాలు లేరు అని రాహుల్ బడ్జెట్ మీద మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ అగ్గి రవ్వలా రాజుకుంది. దానికి బదులుగా అన్నట్లుగా బీజేపీ నుంచి కూడా రాహుల్ కి అంతే ధీటుగా కామెంట్స్ వచ్చిపడ్డాయి.

కులమేంటో తెలియని వాళ్ళు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు అంటూ బీజేనీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ దానికి ప్రతి సమాధానం చెప్పడంతోనే పార్లమెంట్ లో రచ్చ స్టార్ట్ అయింది. అతాను ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదని, ఏ ఒక్కరినీ ఉద్దేశించి కానే కాదని . తాను జనరలైజ్ చేశానని బీజేపీ ఎంపీ చెప్పినా అది చిలికి చిలికి గాలి వాన అయింది.

నిజానికి బడ్జెట్ సెషన్ లో బీజేపీని రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఇబ్బందుల్లో పెడుతోంది. రాహుల్ అయితే పవర్ ఫుల్ గా స్పీచ్ ఇస్తున్నారు. ఆయన కుల గణన గురించి ప్రస్తావిస్తున్నారు. నూటికి తొంబై శాతం మంది హిందువులలో బడుగులు బలహీనులు ఆదీవాసీలు ఉన్నారని బీజేపీ పెద్దలకు తెలియచేస్తున్నారు.

చాలా కాలంగా చూస్తే కాంగ్రెస్ వారిని వెనకేసుకుని వస్తోంది. ఒక నూతన రాజకీయ పంధాను వ్యూహాన్ని అనుసరిస్తోంది. కుల గణన ఎందుకు చేయరని బీజేపీ మీద ఒత్తిడి తెస్తొంది. ఈ పరిణామాలు బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో బీజేపీ నుంచి ఎదురుదాడి స్టార్ట్ అవుతోంది.

మీ పాలనలో ఏమి చేశారు అని కర్ణాటకలో ఎస్సీ ఎస్టీ నిధులు మళ్ళింపుతో పాటు ఆర్జీఎఫ్ లో ఎస్సీల ప్రాతినిధ్యం పైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ ని ఎదురు ప్రశ్నించారు. ఇల వారూ వీరూ కలసి కులాల గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ కులాల ప్రసక్తి అవసరమా అంటే ప్రజలకు కాదు కానీ రాజకీయాలకు నేతలకు అవసరమే అని అంటున్నారు. ఒక దఫా పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ మీద ప్రసంగించి అధికార బీజేపీలో మంటలు పుట్టించిన రాహుల్ గాంధీ ఇపుడు కులమేంటో తెలియని వాళ్లు అన్న కామెంట్స్ కి కూడా గట్టిగానే జవాబు చెబుతారా అన్న చర్చ ఉంది. రాహుల్ స్పీచ్ కోసం అంతా చూస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ప్రతిపక్ష నేతను కార్నర్ చేయాలని చూస్తోంది. సో ముందు ముందు బడ్జెట్ సెషన్ లో సంచలన ప్రసంగాలు ఉండే చాన్స్ అయితే ఉంది అని అంటున్నారు.