అమేథీ కాదు.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్.. మోడీకి మరో ఛాన్స్ ఇచ్చారా?
ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇప్పటికే సూటిపోటి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు మరో చిక్కులో పడింది
By: Tupaki Desk | 3 May 2024 6:04 AM GMTప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇప్పటికే సూటిపోటి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు మరో చిక్కులో పడింది. ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీ సంప్రదాయంగా వస్తున్న అమేధీ(యూపీ లో) నియోజకవర్గాన్ని వదలేశారు. గత రెండు ఎన్నికల నుంచి బీజేపీ.. రాహుల్‌ను టార్గెట్ చేసింది. అయితే.. 2014లో అంతో ఇంతో శ్రమించి బయట పడినా.. 2019లో మాత్రం అమేథీలో రాహుల్ పరాజయం పాలయ్యారు. ఇక్కడ నుంచి బీజేపీఅభ్యర్తి, కేంద్ర మంత్రిస్మృతి ఇరానీ విజయం దక్కించుకున్నారు.
పోనీ.. ఇప్పుడైనా.. అక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారని అనుకుంటే.. రాహుల్.. రాయబరేలికి వెళ్లిపోయారు. తాజాగా ఆయనను రాయబరేలి నియోజకవర్గానికి అభ్యర్తిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయి తే.. ఇది సోనియా గాంధీ నియోజకవర్గం. 2004 నుంచి ఆమె ఇక్కడ విజయం దక్కించుకుంటు న్నారు. ఈ సారి ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా తప్పుకొన్నారు. ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నో తర్జనభర్జన అనంతరం.. ఇక్కడ నుంచి రాహుల్ బరిలో దిగుతున్నారు.
ఇక, ఇప్పటికే గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వయనాడ్(కేరళ)లో మరోసారి రాహుల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు ముగిశాయి. అయితే.. గెలుపు అంత ఈజీకాదు. మిత్రపక్షం .. సీపీఐ ఇక్కడ రాహుల్‌ను ఢీకొంది. సీనియర్ నేత డి. రాజా సతీమణి.. అగ్రనేత.. అన్నీరాజా.. రాహుల్‌పై నిలబడ్డారు. దాదాపు ఆమెదే విజయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి. రాయబరేలి నుంచి నిలబడుతున్నారు.
ఈ పరిణామాలు.. బీజేపీకి, ముఖ్యంగా రాహుల్‌ను విమర్శించే ప్రధాని మోడీకి అవకాశం ఇచ్చినట్టేనని అంటున్నారు పరిశీలకులు. అమేఠీ నుంచి యువరాజు పారిపోయారన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. దీని నుంచి రాహుల్ తనను తాను రక్షించుకోలేక పోతున్నారు. ఇక, వయనాడ్‌లోనూ ఆయనకు సొంత మిత్రపక్షమే ఎదురు తిరిగింది.. మొత్తంగా చూస్తే.. రాహుల్ మరిన్నిచిక్కుల్లో ఉన్న విషయం వాస్తవం.
ఇక, అమేధీ నుంచి ఆయన బావ రాబర్ట్ వాద్రా టికెట్ ఆశించారు. కానీ, పార్టీ ఆయనను పక్కన పెట్టి.. సీనియర నేత కిశోరీ లాల్ శర్మకు అవకాశం ఇచ్చింది. ఈ పరిణామం.. సొంత కుటుంబంలో మరింత కాక పుట్టించడం ఖాయమని.. వాద్రా ఎదురు తిరుగుతారని.. సొంతగానే నామినేషన్ వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. అది పరోక్షంగా కాంగ్రెస్‌కు మరింత దెబ్బ కొడుతుందని అంచనా వేస్తున్నారు.