ఎగ్జిట్ పోల్స్ స్థానంలో మోడీ పోల్స్... రాహుల్ సెటైర్స్!
ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు.
By: Tupaki Desk | 2 Jun 2024 1:14 PM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేశాయి. వాస్తవ ఫలితాలు వచ్చేలోపు ఈ ఎగ్జిట్ ఫలితాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు.
అవును... దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ స్థాయిలోని చాలా సంస్థలు మరోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని అంచనాలు వేశాయి. ఇదే సమయంలో... ఇండియా కూటమికి ఘోర ఓటమి తప్పదనే స్థాయిలో ఫలితాలు వెల్లడించాయనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.
ఈ సందర్భంగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇందులో మెజారిటీ ఫలితాలు ఫేక్ అని ఒకరంటే, పెయిడ్ అని మరికొంతమంది కామెంట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇందులో భాగంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో బీజేపీ రికార్డు స్థాయిలో మూడోసారి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇందులో భాగంగా... ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని.. అవన్నీ మోడీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో... ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. శనివారం సాయంత్రం 6:30 నిమిషాల అనంతరం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... కేంద్రంలో ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.