Begin typing your search above and press return to search.

ఉత్తమ్ ను తప్పించి శ్రీధర్ బాబుకు.. తప్పును దిద్దిన రాహుల్

ఈ తప్పును గమనించిన రాహుల్ గాంధీ.. తాజాగా నిర్వహిస్తున్న సభల్లో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తన ప్రసంగాల్ని అనువాదం చేసే బాధ్యతను అప్పజెప్పారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 6:09 AM GMT
ఉత్తమ్ ను తప్పించి  శ్రీధర్ బాబుకు.. తప్పును దిద్దిన రాహుల్
X

అన్ని బాగున్నా.. అల్లుడి నోట్ల శని అన్న చందంగా ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి చెందిన కీలక నేత మాట్లాడే మాటల్ని.. చక్కటి తెలుగులో అనువాదం చేసే కాంగ్రెస్ నాయకుడు లేడా? అన్న భావన కలుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగాన్ని అనువాదం చేసే బాధ్యతను మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పటం.. ఆయన అనుమాద శైలి కాంగ్రెస్ నాయకులకే కాదు.. సభకు హాజరైన వేలాది మంది ప్రజలకు భరించలేనిదిగా మారటం తెలిసిందే.

ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విడిరోజుల్లో అయితే ఫర్లేదు. కీలకమైన ఎన్నికల వేళలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అన్నది ప్రశ్నగా మారింది. జాతీయనాయకత్వానికి చెందిన నాయకులు వచ్చి.. మాట్లాడుతున్న వేళలో వారి ఉత్తేజభరితమైన ప్రసంగాల్ని అంతే ఉత్తేజంగా ఉండేలా అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరచూ ఫెయిల్ అవుతూ ఉంటుంది.

రాహుల్ గాంధీ స్పీచ్ ను అనువాదం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరి సహనానికి పరీక్ష పెట్టారన్న మాట బలంగా వినిపించింది. ఈ తప్పును గమనించిన రాహుల్ గాంధీ.. తాజాగా నిర్వహిస్తున్న సభల్లో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తన ప్రసంగాల్ని అనువాదం చేసే బాధ్యతను అప్పజెప్పారు.

ఇదంతాచూస్తున్న వారికి.. గతంతో పోలిస్తే రాహుల్ మరింత చురుగ్గా స్పందిస్తున్నారని.. ఏదైనా తప్పు జరిగినంతనే దాన్ని సర్దుబాటు చేయటంతో పాటు.. దిద్దుబాటు చేయటం పార్టీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.