బిగ్ బ్రేకింగ్: రాహుల్ గాంధీకి భారీ ఊరట..!
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది
By: Tupaki Desk | 4 Aug 2023 8:46 AM GMTకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువునష్టం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అవును... "మోడీ ఇంటిపేరు" కు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నేడు నిలిపేసింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.
కాగా... 2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన పూర్ణేశ్ మోడీ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోడీ గుజరాత్ లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
దీంతో... ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పు చెప్తూ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు ఆశ్రయించినా కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది. రాహుల్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇదే అంశంపై స్పందించిన కాంగ్రెస్... విద్వేషంపై ప్రేమ సాధించిన విజయమని పేర్కొంది.