వైఎస్సార్ గురించి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా... వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురష్కరించుకుని ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 8 July 2024 7:43 AM GMTదివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ.. వైఎస్సార్ కి నివాళులు అర్పిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
అవును... దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు నివాళులు అర్పిస్తూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ కుమారుడు జగన్, కుమర్తె షర్మిళ, భార్య విజయమ్మ... ఇడుపులపాయలోని ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. వైఎస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించారు.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు.
ఇందులో భాగంగా... వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురష్కరించుకుని ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని అన్నారు. ఎల్లాప్పుడూ ప్రజల కోసమే ఆలోచించి, ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.
ఇదే క్రమంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదని.. కష్టాలూ, కన్నీళ్లు ఉండేవి కావని రాహుల్ గాంధీ తెలిపారు. ఇదే సమయంలో... వైఎస్సార్ వారసత్వాన్ని షర్మిళ సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తుందని.. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం అవుతుందని అన్నారు.
ఇదే సమయంలో... డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పిన రాహుల్ గాంధీ... తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఆయన పాదయాత్రే స్పూర్తి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేది అనే వ్యాఖ్యలు కీలకంగా మారాయి!