Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం కాంగ్రెస్ కి ఓటు వేయలేకపోయిన సోనియా - రాహుల్!

దీంతో ఈ ఉదయం న్యూఢిల్లీ లోక్‌ సభ పరిధిలోని పోలింగ్ బూత్‌ లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 7:17 AM GMT
ఫస్ట్  టైం కాంగ్రెస్  కి ఓటు వేయలేకపోయిన సోనియా - రాహుల్!
X

దేశంలో మొదలైన లోక్ సభ ఎన్నికల సందడి ఇప్పటికే ఐదు విడతలు ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఆరో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకే మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినీయోగించుకోవడానికి క్యూలైన్స్ లో నిలబడ్డారు.

దేశంలో ఆరో విడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 58 లోక్‌ సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్-14, హర్యానా-10, బీహార్-8, పశ్చిమబెంగాల్-8, ఢిల్లీ-7, ఒడిశా-6, జార్ఖండ్-4, జమ్మూకాశ్మీర్-1 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.

అయితే ఈ ఆరో దశ ఎన్నికల్లో పలువురు కీలక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటొన్నారు. ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్.. ఈ ఎన్నికలతో బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. సుష్మాస్వరాజ్ కూడా తన తొలి లోక్ సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోమ్‌ నాథ్ భారతిపై ఆమె పోటీ చేశారు. దీంతో ఈ ఉదయం న్యూఢిల్లీ లోక్‌ సభ పరిధిలోని పోలింగ్ బూత్‌ లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన మేనల్లుడు, మేనకోడలితో రాహుల్ ఫుట్ పాత్ పై కూర్చిని కనిపించడం ఆసక్తిగా మారింది.

రాబర్ట్ వాద్రా - ప్రియాంక గాంధీ దంపతుల కొడుకు రేహాన్ రాజీవ్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా కూడా ఇదే లోక్‌ సభ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం తల్లితో సెల్ఫీ దిగిన రాహుల్ గాంధీ... ఆ వెంటనే పోలింగ్ బూత్ నుంచి తన తల్లితోపాటు నివాసానికి వెళ్లిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమీంటే... అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు తనకు కానీ తన పార్టీ అభ్యర్థికి కానీ వేసుకోలేకపోయారు. పొత్తులో భాగంగా మంగళగిరిలో పోటీకి నిలబడ్డ టీడీపీ అభ్యర్థి లోకేష్ కు పవన్ తన ఓటు వేశారు. ఇడే క్రమంలో గాంధీ ఫ్యామిలీకి జరిగింది.

ఇందులో భాగంగా... గాంధీ ఫ్యామిలీ తొలిసారిగా మరో పార్టీకి ఓటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమ్‌ నాథ్ భారతికి సోనియా, రాహుల్, ప్రియాంక & కో లు ఓటు వేశారని అంటున్నారు!

కాగా... ఇంకా పోలింగ్ కేంద్రంలోనే ఉన్న తన బావ రాబర్ట్ వాద్రా కోసం రాహుల్ గాంధీ ఇలా కాసేపు రోడ్డు మీదే గడిపారు! ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి వాద్రా బయటికి వచ్చిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.