Begin typing your search above and press return to search.

పెళ్లిపీటలు ఎక్కనున్న రాహుల్ గాంధీ?

తాను కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిలో ఆశ్చర్యం నింపుతున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2024 3:19 PM GMT
పెళ్లిపీటలు ఎక్కనున్న రాహుల్ గాంధీ?
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయసు 53 సంవత్సరాలు. అయినా కాంగ్రెస్ లో ఆయన యువనేతే. యువ నేత అనే అందరు సంబోధిస్తారు. మరి 53 ఏళ్లకు కూడా యువకుడే అనడం వారికే చెల్లుతుంది. ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమయో అన్నారో సినీకవి. రాహుల్ గాంధీకి ఏమైందో కానీ ఆయన మనసు పెళ్లి వైపు మళ్లింది. తాను కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిలో ఆశ్చర్యం నింపుతున్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనను అభిమానులు పెళ్లెప్పుడు అని ప్రశ్నించగా త్వరలో చేసుకుంటానని చెప్పడం గమనార్హం. దీంతో రాహుల్ గాంధీ పెళ్లిపై అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కూడా ఓ అభిమాని రాహుల్ గాంధీ పెళ్లెప్పుడని ప్రశ్నించగా మీరే పిల్లను చూడండి అంటూ చలోక్తిగా సమాధానం చెప్పడం విశేషం. దీంతో తొందరలో రాహుల్ పెళ్లి కొడుకు కానున్నాడనే వాదనలు మొదలయ్యాయి. ఆయన పెళ్లి దేశంలోనే సంచలనం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అగ్ర నేతగా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడంపై కూడా చాలా మందికి అనుమానాలు ఉన్న మాట వాస్తవమే.

ఇప్పుడు పెళ్లికి రెడీ అనే సంకేతాలు రావడంతో చాలా మంది పిల్లను చూసే పనిలో పడిపోయారు. కానీ రాహుల్ కు నచ్చిన అమ్మాయి ఇదివరకే చూసుకున్నారని కొందరి వాదన. దీంతో రాహుల్ పెళ్లి సందడిగా అవుతుందని అంచనా వేస్తున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాహుల్ వివాహం వైరల్ కావడం సహజమే అంటున్నారు.

ఎన్నాళ్లకు రాహుల్ కు పెళ్లి మీద మనసు మళ్లింది. ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సిన వయసు దాటిపోయారు. ఇంత ఆలస్యంగానైనా వివాహానికి ఒప్పుకోవడం అందరికి సంతోషంగా ఉంది. రాహుల్ పెళ్లి చూడాలని ఎంతో మంది ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కల తీరే సమయం ఇక దగ్గర పడిందనే అనుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.