రాహుల్ సెటైర్ బాగుందిగా !
జనాలకు ఏవి కనెక్ట్ అవుతాయి జనంలోకి తొందరగా ఎలా వెళ్తాయి అన్నది ఆలోచించి మరీ ఆయన స్పీచ్ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 4 July 2024 3:30 PM GMTరాహుల్ గాంధీ స్పీచ్ ఆకట్టుకోవడం వెనక చాలా అంశాలు ఉన్నాయి. ఆయన గతంలో మాదిరిగా రొటీన్ స్పీచ్ ఇవ్వడం లేదు. తన స్పీచ్ లో పంచులు సెటైర్లు ఉండేలా చూసుకుంటున్నారు. జనాలకు ఏవి కనెక్ట్ అవుతాయి జనంలోకి తొందరగా ఎలా వెళ్తాయి అన్నది ఆలోచించి మరీ ఆయన స్పీచ్ ఇస్తున్నారు. అందులో పొలిటికల్ మసాలా దట్టించి వదులుతున్నారు.
దాంతో రాహుల్ స్పీచ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లోక్ సభలో తాజాగా ఆయన చేసిన స్పీచ్ కి సర్వత్రా ప్రశంసలు లభించాయి. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆయన వేసిన సెటైర్లు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.
ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు అంటే మోడీ బయోలాజికల్ కాదు ఆయనకు నేరుగా దేవుడితో కనెక్షన్ ఉంది అని. మోడీ డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతారు అని కూడా రాహుల్ గాంధీ వేసిన ఈ సెటైర్ ఇపుడు దేశంలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫుల్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తిరుగుతోంది.
అయితే మోడీ ఈ సెటైర్ కి ఇరకాటంలో పడ్డారు అని అంటున్నారు. గతంలో ఎన్నికల సభలలో ఆయన ఈ రకంగా స్పీచ్ ఇచ్చారు. తాను దేవాంశ సంభూతిడిని అన్నట్లుగా ఆయన మాట్లాడారు అని ప్రచారంలో ఉంది. తనను దైవ కార్యం కోసమే దేవుడు ఈ భూమి మీదకు పంపించారు అన్నట్లుగా మోడీ మాట్లాడారు అని ప్రచారంలో ఉంది.
సరిగ్గా దాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ సరైన చోటనే సెటైర్లు వేశారు తనకు ఎదురుగా ప్రధాని సీట్లో కూర్చున్న మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వేసిన ఈ సెటైర్ మాత్రం బాగా పేలింది. పైగా గతంలో మోడీ చెప్పిన దానిని పట్టుకుని సైన్స్ పరిభాషలో వాడి రాహుల్ గాంధీ ప్రజలకు మోడీ ఏమిటి అన్నది చూపించారు అని అంటున్నారు.
నిజంగా మోడీ అన్న మాటలను ఒక్కసారి గమనిస్తే నా శక్తి జీవసంబంధమైనది కాదని నమ్మి దేవుడు నన్ను పంపాడు అని మే 23న జరిగిన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. మా అమ్మ జీవించి ఉన్నప్పుడు నేను జీవశాస్త్రపరంగా జన్మించానని నమ్ముతాను. ఆమె మరణించిన తర్వాత నా అనుభవాలన్నింటినీ పరిశీలించిన తర్వాత దేవుడే నన్ను పంపాడని నాకు నమ్మకం కలిగింది. ఈ శక్తి నా జీవసంబంధమైన శరీరం నుండి కాదు, కానీ భగవంతునిచే నాకు ప్రసాదించబడింది నేను ఏదైనా చేసినప్పుడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నానని మోడీ చెప్పారు.
అయితే ఎన్నికల ప్రచారంలో ఇది కొంత వరకూ చర్చకు వచ్చినా ఆ వేడిలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొత్త లోక్ సభ సమావేశంలో తొలిసారిగా విపక్ష నేత హోదాలో ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఇదే టాపిక్ ని ఎంచుకోవడం మాత్రం ఆయన రాజకీయ వ్యూహాన్ని చాటి చెబుతోంది.
ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరూ కూడా ఈ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు అంతా పూర్తి ఏకాగ్రతను చూపిస్తున్న వేళ కరెక్ట్ టైం చూసి రాహుల్ గాంధీ ప్రయోగించారు. మోడీ అన్నది ఆధ్యాత్మిక ధోరణి తోనో లేక తాత్విక వైఖరి తోనో తెలియదు కానీ దానిని ముడిపెట్టి మోడీ దేవుడితోనే నేరుగా మాట్లాడుతారు అని రాహుల్ వేసిన సెటైర్ మాత్రం వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.
దీని మీద అధికార బీజేపీ ఖండించినా కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ప్రధాని ఎన్నికల సభలలో మాట్లాడారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది అని అంటున్నారు. అలా విపక్ష నేతగా తన మొదటి స్పీచ్ తోనే చుక్కలు చూపించారు రాహుల్ అని అంటున్నారు. అంతే కాదు సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేశారు అని అంటున్నారు.
ఈ విధంగా ఎన్డీయే ప్రభుత్వం మీద కావాల్సినంత వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా పోగేసేందుకు కూడా మంచి అవకాశాన్ని కొట్టేశారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దీనికి సరైన కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ నుంచి ఏ విధంగా సెటైర్లు రాహుల్ గాంధీకి వస్తాయో.