Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ ప్లాన్ ని సెట్ చేయనున్న రాహుల్...!?

ఏపీలో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగాలి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద కాంగ్రెస్ అగ్ర నేత ప్లాన్ రెడీ చేయనున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:41 AM GMT
ఏపీ  కాంగ్రెస్ ప్లాన్ ని సెట్ చేయనున్న రాహుల్...!?
X

ఏపీలో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగాలి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద కాంగ్రెస్ అగ్ర నేత ప్లాన్ రెడీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ నెల 27న న్యూ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో రాహుల్ కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు.

ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పల్లం రాజు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తదితర ముఖ్య నేతలు అంతా ఈ మీటింగ్ కి హాజరు కానున్నారు అని అంటున్నారు.

ఈ మీటింగ్ తరువాత కాంగ్రెస్ ఏపీలో అనుసరించే వ్యూహాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని చూస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణాలో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇండియా కూటమిలో కూడా వామపక్షాలు కీలకంగా ఉన్నాయి.

దాంతో ఏపీలో కూడా ఉభయ వామపక్షాలు ప్లస్ కాంగ్రెస్ కలసి ముందుకు వెళ్ళాయని చూస్తున్నాయట అదే జరిగితే ఏపీలో మరో కూటమి ముందుకు వస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు టీడీపీ జనసేన కూటమిని ఏర్పాటు చేశారు. అందులోకి చివరి నిముషంలో అయినా బీజేపీ వచ్చి చేరుతుంది అని అంటున్నారు.

దాంతో పాటు ఇపుడు మూడవ కూటమిగా కాంగ్రెస్ ఏర్పడితే ఓట్ల చీలిక తధ్యమని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఓట్లు ఎవరివి చీల్చుకుంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. అధికార వైసీపీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కొల్లగొట్టి ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్నా అది అధికార వైసీపీకి ఇబ్బంది అవుతుంది ఒక విశ్లేషణ ఉంది.

అయితే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వ్యతిరేక ఓటే చీలుతుంది అన్నది మరో మాట. అదే జరిగితే మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని ఎక్కడా చీలకుండా ఒడిసిపట్టుకోవాలని చూస్తున్న టీడీపీకి ఇది ఎంతో కొంత దెబ్బగానే చూడాలని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీకి ఉన్నా బీజేపీ వైపు కూడా ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. రేపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కాబట్టి చంద్రబాబు ఎటూ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ కూటమి మాత్రం ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం వంటి వాటితో కాంగ్రెస్ కమ్యూనిస్టులు జనంలోకి వస్తే మూడవ కూటమి వైపుగా చాలా ఓట్లు వెళ్లడం ఖాయమని అంటున్నారు.