Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్... ఇకపై రైళ్లలో రీల్స్ చేస్తే...?

అవును... ఇటీవల జైపూర్ డివిజన్ లో రైల్వే ట్రాకుపై ఓ ఎస్.యూ.వీ. నదిపిస్తూ స్టంట్లు చేసింది ఓ బ్యాచ్.

By:  Tupaki Desk   |   16 Nov 2024 3:37 AM GMT
మేటర్  సీరియస్... ఇకపై రైళ్లలో రీల్స్  చేస్తే...?
X

వాళ్లకూ అంతే ప్రమాదకరంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్స్, లోకల్ ట్రైన్, రైల్వే ట్రాక్స్ అంటూ.. పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ పైనే ఈ రీల్స్ బ్యాచ్ ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఇటీవల జైపూర్ డివిజన్ లో రైల్వే ట్రాకుపై ఓ ఎస్.యూ.వీ. నదిపిస్తూ స్టంట్లు చేసింది ఓ బ్యాచ్. ఇది కూడా రీల్స్ కోసమే అని అంటున్నారు. వీరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

చెన్నైలోని కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ప్రమాదకరంగా రైల్వే ఫుట్ బోర్టు ప్రయాణం చేయడమే కాకుండా.. రైల్వే స్టేషన్ లో గందరగోళం సృష్టించారు! రైలుపై ఎక్కేందుకు వీరు ప్రయత్నించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో.. సుమారు 10 మంది స్టూడెంట్స్ పై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు.

ఇక ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతల్లో మెట్రో ట్రైన్స్ లోనూ, లోకల్ ట్రైన్స్ లోనూ కొంతమంది యువతీ, యువకులు చేస్తున్న వ్యవహారాల సంగతి తెలిసిందే. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్ పేరు చెప్పి వీళ్లు చేసిన వ్యవహారాలు అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకున్నాయి.

ఇలా అనేక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... రైల్వే ప్రాంగణాలు, కదులుతున్న రైళ్లల్లో ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్.ఐ.అర్. నమోదు చేయాలని అన్ని జోన్ లకూ సూచించింది. ఇటీవల సోషల్ మీడియాలో కోసం కొంతమంది చేస్తున్న వ్యవహారాల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా.. కొంతమంది ఆకతాయులు అన్ని హద్దులూ దాటేస్తున్నారని.. పనికిమాలిన పనులతో వారి ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా.. వందలాది మంది రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే నిబంధనలు అతిక్రమించి రీల్స్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్ని జోన్ లకూ సూచించినట్లు తెలిపారు!