Begin typing your search above and press return to search.

శిల్పాశెట్టి పేరును ఇందులోకి లాగొద్దు: రాజ్ కుంద్రా

అంతేకాదు.. త‌న భార్య శిల్పాశెట్టి పేరును సంబంధం లేకుండా దీనిలోకి లాగడం మానేయాలని రాజ్ కుంద్రా మీడియాను కోరారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 10:36 AM GMT
శిల్పాశెట్టి పేరును ఇందులోకి లాగొద్దు: రాజ్ కుంద్రా
X

అశ్లీల యాప్‌ల నిర్వ‌హ‌ణ‌ కేసుతో ముడిప‌డిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈడీ అధికారులు బిజినెస్‌మేన్ కం సినీనిర్మాత‌ రాజ్ కుంద్రాను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి ఆస్తుల‌పై ఇటీవ‌ల ఈడీ దాడులు నిర్వ‌హించింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో వార్తలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ కేసులో శిల్పాశెట్టి పేరును లాగొద్ద‌ని వారి న్యాయవాది మీడియాను కోరారు. ఆమె అమాయకురాలు.. త‌న‌కు దీంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అంతేకాదు.. త‌న భార్య శిల్పాశెట్టి పేరును సంబంధం లేకుండా దీనిలోకి లాగడం మానేయాలని రాజ్ కుంద్రా మీడియాను కోరారు.

రాజ్ కుంద్రా త‌ర‌పు లాయ‌ర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సాగుతున్న విచారణకు రాజ్ పూర్తి సహకారాన్ని అందిస్తున్నార‌ని .. ఇందులోకి శిల్పాశెట్టి పేరును లాగొద్ద‌ని వ్యాఖ్యానించారు. అశ్లీల చిత్రాలు, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలను అతిశయోక్తి డ్రామాగా కొట్టిపారేసిన ఆయన, న్యాయం చివరికి నిజాన్ని వెల్లడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అసోసియేట్స్, పో*గ్ర‌ఫీ, మనీ లాండరింగ్ వాద‌న‌ల‌ విషయానికొస్తే ఎంతటి సంచలనం చేసినా సత్యాన్ని మరుగుపరచలేమ‌ని చెప్పాల‌ని... చివరికి న్యాయమే గెలుస్తుందని మీడియా గ్ర‌హించాల‌ని అన్నారు.

ఈ కేసులో శిల్పాశెట్టిని పదేపదే లింక్ చేయ‌వ‌ద్ద‌ని రాజ్ మీడియాను కోరారు. సరిహద్దులను గౌరవించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పాడు. సంబంధం లేని విషయాలలోకి ఆమెను లాగ‌డం ఆపమని వారిని కోరారు. ``సంబంధం లేని విషయాల్లోకి నా భార్య పేరును పదే పదే లాగడం ఆమోదయోగ్యం కాదు. దయచేసి సరిహద్దులను గౌరవించండి.!!! #ఈడీ`` అని సోష‌ల్ మీడియాలో రాజ్ కుంద్రా రాశాడు.

అంతకుముందు శిల్పా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మీడియాను త‌న‌దైన శైలిలో హెచ్చ‌రించారు. ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్న‌ కేసుతో లేదా చట్టపరమైన ఉల్లంఘనలతో శిల్పాశెట్టికి ఎలాంటి సంబంధం లేదని లాయ‌ర్ పేర్కొన్నారు. శిల్పాశెట్టి ఇంటిపై ఈడీ దాడి చేసింద‌న్న వార్త‌లు నిరాధారమైనవి. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయ‌ని పాటిల్ అన్నారు. అలా చేయ‌డానికి ఎలాంటి కారణం లేదని నొక్కి చెప్పారు. కేసు గురించి నిజాన్ని వెలికితీసేందుకు రాజ్ ఈడీ అధికారులకు చురుకుగా సహకరిస్తున్న విష‌యాన్ని లాయ‌ర్ హైలైట్ చేసారు. శిల్పా శెట్టి ప్రతిష్టను దిగ‌జార్చేలా సంబంధం లేని ఆమె ఫోటోలు లేదా వీడియోలను ఉపయోగించడం మానేయాలని లాయ‌ర్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను విస్మరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. 2022 నుంచి ఈ కేసులో విచార‌ణ సాగుతోంది. రాజ్ కుంద్రా కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నారు. ఆయ‌న‌ను ఇటీవ‌లే బెయిల్‌పై విడుదల చేసారు.

ఈ కేసులో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా , ఉమేష్ కామత్ వంటి వారిని, రాజ్ కుంద్రా ఫిల్మ్స్‌కు సంబంధించిన అధికారులను కూడా విచారించిన సంగ‌తి తెలిసిందే.