ఏపీ పాలిటిక్స్ మీద కోమటిరెడ్డి హాట్ కామెంట్స్...!
ఏపీ తెలంగాణా రాజకీయాల మీద అటు నుంచి ఇటు మాట్లాడుతూంటారు. ఇటు నుంచి అటు విశ్లేషిస్తూంటారు.
By: Tupaki Desk | 16 Feb 2024 3:50 AM GMTఏపీ తెలంగాణా రాజకీయాల మీద అటు నుంచి ఇటు మాట్లాడుతూంటారు. ఇటు నుంచి అటు విశ్లేషిస్తూంటారు. పదేళ్ల ముందు దాకా రెండు ఒక్కటే కాబట్టి రాజకీయ సరళి మీద వర్తమానం గురించి ఎవరికి తోచిన విశ్లేషణ వారు వినిపిస్తూంటారు.
ఇదిలా ఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేత సీనియర్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపీ పాలిటిక్స్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చెస్శారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గ్రాఫ్ ఏపీలో పెరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు
అదే సమయంలో కాంగ్రెస్ కి పెరిగిన గ్రాఫ్ వల్ల వైసీపీ కంటే విపక్షాలకే దెబ్బ పడుతుందని తనదైన కొత్త విశ్లేషణ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ చీల్చేది జగన్ వ్యతిరేక ఓటు అన్నది ఆయన భావనగా ఉంది. కాంగ్రెస్ ఓట్లు ఎంత పెరిగితే అంత వైసీపీకే లాభం అని ఆయన అంటున్నారు.
అదే సమయంలో ఏపీలో వైసీపీకి ప్రభుత్వ పధకాలను దక్కించుకున్న లబ్దిదారులు పెద్ద ఎత్తున ఉన్నారని వారు బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్నారని విశ్లేషించారు. అందువల్ల ఏపీలో వైసీపీకి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడడం లాభకరమే అవుతుందని ఆయన చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఏపీలో తమ పార్టీ ఎదుగుదల వల్ల వైసీపీకే లాభం అని విశ్లేషించడం మాత్రం ఆసక్తినే పెంచుతోంది. అదే సమయంలో ఏపీలో చూస్తే షర్మిల రాక వల్ల విపక్షాలకు లాభం అని చీలేది వైసీపీ ఓటు అని ఒక విశ్లేషణ ఉంది. చాలా మంది అదే అంటున్నారు.
ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ వైసీపీ నుంచి కాంగ్రెస్ ఎక్కువగా చీల్చుకుంటుందని అంటున్నారు. అయితే అది తప్పు అన్నట్లుగా కోమటిరెడ్డి వాదన ఉంది. అయితే ఆయన అన్నారని కాదు ఒక తటస్థ వాదన ప్రకారం చూస్తే 2014లో పూర్తిగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నే వైసీపీ వాడుకున్నా 2019కి వచ్చేసరికి తన ఇమేజ్ తో కూడా జగన్ కొత్త ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు అని అంటున్నారు.
అది జగన్ పాదయాత్ర చేసిన తరువాత ఏపీలో ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారని అంటున్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అయిదేళ్ల పాలనలో ఆయన బీసీలను దగ్గరకు తీశారని అలాగే పధకాలతో మహిళా ఓటు బ్యాంక్ ని కూడా పెద్ద ఎత్తున తిప్పుకున్నారు అని అంటున్నారు.
అలా వైసీపీకి ఒక పటిష్టమైన ఓటు బ్యాంక్ తయారైంది అని అంటున్నారు. ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ కోరుకునే వారుగా ఉంటుంది. కాదు అనుకుంటున్న సెక్షన్లు నిజానికి టీడీపీ కూటమికి ఓటు వేయాలి. ఇపుడు కాంగ్రెస్ పుంజుకుంటే కనుక వారంతా కొంతమంది అయినా ఆ వైపు మళ్లాలి. అలా చూస్తే విపక్ష కూటమికే కాంగ్రెస్ ఎదుగుదల దెబ్బ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.