Begin typing your search above and press return to search.

నేనొస్తున్న .. చేతనైతే అడ్డుకోండి !

‘’జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 10:10 AM GMT
నేనొస్తున్న .. చేతనైతే అడ్డుకోండి !
X

‘’జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారు. గోవధ చేయవద్దని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ? హైదరాబాద్ కు యధేచ్చగా గోవులను తరలిస్తున్నారు. ఈసారి నేనే రంగంలోకి దిగుతా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా’’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సవాల్ విసిరాడు.

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గోవుల తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలి. పోలీసుల పని హిందూ కార్యకర్తలు చేస్తుంటే… వాళ్ళను సపోర్ట్ చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటి ? హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా ? అని రాజాసింగ్ మండిపడ్డాడు.

గోవధ అడ్డుకోవడానికి నేనే నేరుగా రంగంలోకి దిగుతా అన్నారు. దమ్ముంటే అడ్డుకోవాలని రాజాసింగ్ సవాల్ చేశారు. గోవధను అడ్డుకుంటే బుల్లెట్ దించుతా అని ముస్లీంలు బెదిరిస్తున్నారు. ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంతో చూసుకుందాం అంటూ రాజాసింగ్ అన్నాడు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి. హిందు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించడం ఆపాలి. గో రక్షణ చేస్తే షూట్ చేస్తామని అంటున్నారు. వాళ్లకు నా ఛాలెంజ్ ఎవరిలో దమ్ము ఉందో చూసుకుందాం అని సవాల్ విసిరాడు. రెండు రోజుల క్రితం రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రాగా తెలంగాణ సీఎం రేవంత్ ఫోన్ నంబర్ ఇవ్వడం గమనార్హం. తనను బెదిరిస్తున్న వారి గురించి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే సీఎం నంబర్ ఇచ్చానని చెప్పడం విశేషం.