వీడియో వైరల్... ఈ బిచ్చగాడు "యాపిల్" ఫ్యామిలీ మెంబరే!
రాజస్థాన్ లోని అజ్మీర్ సిటీ నుంచి వైరల్ అయిన ఈ వీడియోలో.. బిజీగా ఉన్న మార్కెట్ లో రెండూ కాళ్లు దెబ్బతిని చేతులతో నెట్టుకుంటూ వెళ్తూ కనిపించిన వ్యక్తి.. బిక్షాటన కోసం వేడుకుంటున్నాడు.
By: Tupaki Desk | 20 Jan 2025 10:30 AM GMTయాపిల్ ప్రోడక్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బెల్ట్ ఉంటుందని చెబుతారు. వారంతా యాపిల్ ప్రోడక్ట్స్ తప్ప మరొకటి వాడరని.. ఐఫోన్ లో నెక్స్ట్ వెర్షన్ రాగానే ఫస్ట్ డే కొనాలనే తపన కలిగి ఉంటారని అంటారు. మరికొంతమందికి ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా.. అప్పు చేసైనా ఐఫోన్ కొంటారనే నానుడి సోషల్ మీడియాలో ఉంది! ఈ సమయంలో ఐఫోన్ ను కలిగిఉన్న బిచ్చగాడి విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ ని పట్టుకుని బిక్షమెత్తుకుంటూ కనిపించాడు ఓ బిచ్చగాడు. రాజస్థాన్ లోని అజ్మీర్ సిటీ నుంచి వైరల్ అయిన ఈ వీడియోలో.. బిజీగా ఉన్న మార్కెట్ లో రెండూ కాళ్లు దెబ్బతిని చేతులతో నెట్టుకుంటూ వెళ్తూ కనిపించిన వ్యక్తి.. బిక్షాటన కోసం వేడుకుంటున్నాడు. ఆ సమయంలో చాలా మంది దృష్టి అతడి చేతిలో ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పై పడింది.
సుమారు రూ.1.5 లక్షలకు పైగా ఖరీదైన ఐఫోన్ ను అతడు కలిగి ఉండటంపై ప్రశ్నించగా.. పూర్తి నగదుతోనే ఆ ఫోన్ ను కొనుగోలు చేసినట్లు బిచ్చగాడు పేర్కొనడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా లో పోస్ట్ చేసిన వ్యక్తి... "ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కలిగిఉన్న ఓ బిచ్చగాడు.. పూర్తిగా క్యాష్ రూపంలో చెలించి, ఈఎంఐ లేకుండా ఈ ఫోన్ ను కొనుగోలు చేసినట్లు చెప్పాడు" అని రాసుకొచ్చాడు.
ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ సంపాదించుకున్న ఈ వీడియో నెట్టింట మరింత హల్ చల్ చేస్తుంది. ఈ సమయంలో "ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది" అని బిచ్చగాడిని అడగగా.. "బిక్షాటన చేయడం ద్వారా!" అని సమాధానం వచ్చింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో కి ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఇందులో భాగంగా... "బెస్ట్ బిజినెస్ విత్ నో ఇన్వెస్ట్ మెంట్, నో జాబ్, నో సెక్యూరిటీ ప్రాబ్లం అండ్ నో స్ట్రెస్" (పెట్టుబడి, ఉద్యోగం చేయాల్సిన అవసరం, భద్రతా సమస్యలు, ఒత్తిడి లేని ఉత్తమ వ్యాపారం) అని కామెంట్ పెట్టగా.. "ఎంత చెట్టుకు అంతగాలి.. ఎవరి స్ట్రెస్ వారికి ఉంటుంది" అని మరొకరు స్పందించారు. ఏది ఏమైనా.. ఈ విషయం వైరల్ గా మారింది.