Begin typing your search above and press return to search.

ప్రేయసితో కలిసి విషం తాగిన రిషభ్ పంత్ ను కాపాడిన వ్యక్తి

2022 డిసెంబరు టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Feb 2025 10:09 AM GMT
ప్రేయసితో కలిసి విషం తాగిన రిషభ్ పంత్ ను కాపాడిన వ్యక్తి
X

2022 డిసెంబరు టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆఖరులో తల్లిని సర్ ప్రైజ్ చేద్దామని ఆమెకు ముందుగా చెప్పకుండా కారులో ఒంటరిగా ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు బయల్దేరాడు అతడు. అయితే, ప్రయాణించేది ఖరీదైన ఎస్ యూవీ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన సెకన్లలోనే స్పందించిన పంత్.. కారులోంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే గాయాలైన అతడిని ఓ యువకుడు గమనించి సపర్యలు చేశాడు. దీంతో పంత్ మరింత తీవ్రంగా గాయపడకుండా తప్పించుకోగలిగాడు. తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు.

ప్రమాదం నుంచి కోలుకునేందుకు పంత్ కు ఏడాదిపైనే పట్టింది. మరీ ముఖ్యంగా కాలుకు గాయం కావడంతో అతడు ఎక్కువ కాలం మైదానంలోకి దిగలేకపోయాడు. కాలుకు దెబ్బతగిలిన పంత్ స్వతహాగా వికెట్ కీపర్ కావడంతో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ నకూ దూరమయ్యాడు.

పంత్ ను ప్రమాదం నుంచి కాపాడిన యువకుడి పేరు రజత్ కుమార్. 25 ఏళ్ల రజత్ యూపీలోని ముజఫర్ నగర్ లో తన ప్రేయసి మను కశ్యప్ (21)తో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి యత్నించారు. అయితే, రజత్ ప్రేయసి చనిపోగా.. అతడు మాత్రం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మనును సైతం ఆస్పత్రికి తరలించినా ఆమె చికిత్స అందిస్తుండగా చనిపోయారు. రజత్ ఇంకా ఎప్పటికి కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.

కాగా, తనను కాపాడిన రజత్ ను పంత్ కొనియాడాడు. తర్వాతి కాలంలో అతడిని గుర్తుచేసుకున్నాడు. రజత్ కూడా తాను ఓ సాధారణ వ్యక్తిని కాపాడినట్లుగా భావించానని, అతడు పంత్ అనుకోలేదని అప్పట్లో తెలిపాడు.