Begin typing your search above and press return to search.

కొత్త చట్టంపై రాజ్ దీప్ సర్దేశాయ్ విమర్శలు

అందులో ఒక చట్టంపై దుమారం రేగుతోంది. దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ అని విమర్శలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 July 2024 4:15 AM GMT
కొత్త చట్టంపై రాజ్ దీప్ సర్దేశాయ్ విమర్శలు
X

ఈ రోజు నుంచి భారత దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులకు కేంద్రం చెల్లుచీటీ రాసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త చట్టాలను పేర్లు మార్చి కేంద్రం తీసుకు వచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలు జులై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.

అందులో ఒక చట్టంపై దుమారం రేగుతోంది. దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ అని విమర్శలు వస్తున్నాయి. మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే, దీనిని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యవహారంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా స్పందించారు. ఉద్యోగం, వివాహం వంటి విషయాల్లో కొందరు పురుషులు, మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరిచే చాన్స్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకునే వారికి 10 సంవత్సరాల జైలు అని కొత్త చట్టం చెబుతోందని, దానిని మిస్ యూజ్ చేసేవారు ఎక్కువ ఉంటారని అన్నారు. ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకున్నా...భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని వాడి తమ తమ కక్షలు తీర్చుకునే చాన్స్ ఉందని అంటున్నారు. సరైన చర్చ లేకుండా..ఈ చట్టాన్ని అమలు చేయకూడదని చెబుతున్నారు.