Begin typing your search above and press return to search.

'బీజేపీలోకి బుగ్గన రాజేంద్రనాథ్'... వైసీపీ ఫైర్!

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పలువురు పార్టీలు మారుతున్నారంటూ కీలక ప్రచారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 July 2024 2:54 PM GMT
బీజేపీలోకి బుగ్గన రాజేంద్రనాథ్... వైసీపీ ఫైర్!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 11 అసెంబ్లీ స్థానాల్లోనూ, 4 లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పలువురు పార్టీలు మారుతున్నారంటూ కీలక ప్రచారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తొలుత వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి ఉబలాటపడుతున్నారనే ప్రచారం బలంగా జరిగింది. ప్రధానంగా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా కాషాయ కండువా కప్పుకోబోతున్నరని, ఈ మేరకు పెద్దిరెడ్డిని కూడా ఒత్తిడి చేస్తున్నారని ఒక ప్రచారం తెగ వైరల్ గా మారింది. అయితే... దీనిపై మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో అవినాష్ రెడ్డిని జగనే బీజేపీలోకి పంపుతున్నారంటూ మరో ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది! దీనిపైనా నేతలు క్లారిటీ ఇచ్చారు.. ఈ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో "బీజేపీలోకి బుగ్గన!... చేరేందుకు విశ్వప్రయత్నాలు" అంటూ ఓ కథనం అచ్చైంది!

అవును... వైసీపీ కీలక నేత, మాజీమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని, బీజేపీలోకి చేరాలనుకుంటున్నారని, దీనికోసం ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఓ కథనం హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆన్ లైన్ వేధికగా ఘాటుగా స్పందించింది.

ఇందులో భాగంగా... మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ అచ్చైంది నిరాధార కథనం అని.. ఆయన పార్టీ మారడం లేదని.. ఆ కథనం పూర్తిగా అవాస్తవం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక "ఎక్స్" లో రియాక్ట్ అయ్యింది.