Begin typing your search above and press return to search.

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ రియాక్షన్ వైరల్!

ప్రస్తుతం రజనీ.. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన "లాల్‌ సలామ్‌" సినిమా ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2024 7:33 AM GMT
విజయ్  పొలిటికల్  ఎంట్రీపై రజనీకాంత్  రియాక్షన్  వైరల్!
X

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో కాస్తా ప్రభావం తగ్గడం.. ఇటీవల డీఎండీకే అధినేత విజయ్‌ కాంత్‌ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే... ఇలాంటి సమయంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... ఆరోగ్యం సహకరించకపోవడంతో సూపర్ స్టార్ వెనక్కి తగ్గినట్లు ప్రకటించారు.

మరోపక్క అధికార డీఎంకేను సీఎం స్టాలిన్‌, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దళపతి విజయ్‌ పార్టీని ప్రకటించడం తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. కారణం... ప్రస్తుతం తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని విజయ్ భర్తీచేసే అవకాశం ఉందని తెలియడమే! ఈ సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ స్పందించారు.

అవును... ప్రముఖ సినీ నటుడు విజయ్‌ ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "తమిళగ వెట్రి కట్చి" పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో... విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అగ్ర నటుడు రజనీకాంత్‌ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ కు శుభాకాంక్షలు చెప్పారు రజనీ.

ప్రస్తుతం రజనీ.. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన "లాల్‌ సలామ్‌" సినిమా ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఆయన... "విజయ్‌ కు నా శుభాకాంక్షలు" అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో విజయ్ కు రజనీకాంత్ సపోర్ట్ ఉంటుందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

అయితే, ఈ ఏడాది జరగబోయే లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని ఆయన తెలిపారు. కాగా... మరో స్టార్ కమల్‌ హాసన్‌ కూడా "మక్కల్‌ నీది మయ్యం" పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో హీరో విశాల్ కూడా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు కథనాలొస్తున్నాయి.