Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలుగు ఎన్నారై హల్ చల్!

ఈ పరిశరాల్లో ఏవైనా అవాంతరాలు జరిగితే.. అందుకు బాధ్యులైనవారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది

By:  Tupaki Desk   |   16 Aug 2023 8:44 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలుగు ఎన్నారై హల్ చల్!
X

శంషాబాద్ విమానాశ్రయంలో హల్ చల్ చేస్తూ.. అధికారులు అడిగిన వివరాలు తెలపకపోవడం, అధికారులతో దురుసుగా ప్రవర్తించడం, ఒక కంప్యూటర్ పగిలిపోవడానికి కారకుడవ్వడం వంటి ఆరోపణలతో ఒక తెలుగు ఎన్నారైని అదుపులోకి తీసుకున్నాయ్యి సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు.

అవును... విమానాశ్రయాలు హై సెక్యూరిటీ జోన్లు అనే సంగతి తెలిసిందే. ఈ పరిశరాల్లో ఏవైనా అవాంతరాలు జరిగితే.. అందుకు బాధ్యులైనవారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు లో ఓ తెలుగు ఎన్నారైని బీభత్సం సృష్టించినందుకు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఒక తెలుగు ఎన్నారై (28) చికాగో నుంచి అబుదాబి మీదుగా హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతను నగరంలో బసకు సంబంధించిన వివరాలను అందించమని అధికారులు అడిగారు! అయితే ఆ వివరాలు అందించడంలో ఆ వ్యక్తి విఫలమయ్యాడు.

అనంతరం భద్రతా బలగాలతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కియోస్క్ యంత్రాన్ని కూడా పగలగొట్టాడని.. ఈ ప్రమాదంలో ఓ కంప్యూటర్ కూడా పాడైపోయిందని తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌ లోని కొంపల్లిలో తన బసను బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే అందుకు సంబంధించిన వివరాలు అందించలేదు!

దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌ పోర్టు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.