Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు: దేశీయ రియల్ ఎస్టేట్ కింగ్ ఆయనే

తాజాగా వెల్లడైన నివేదిక ఒకటి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   12 July 2024 10:30 AM GMT
తాజా రిపోర్టు: దేశీయ రియల్ ఎస్టేట్ కింగ్ ఆయనే
X

తాజాగా వెల్లడైన నివేదిక ఒకటి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించింది. స్థిరాస్తి రంగంలో తిరుగులేని అధిక్యను ప్రదర్శించే టాప్ 10 మందిని ఎంపిక చేసింది. గృహ్-హురున్ తాజాగా విడుదల చేసిన నివేదికప్రకారం చూస్తే దేశీయ స్థిరాస్తి రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారు డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్. రూ.1.24 లక్షల కోట్ల సంపదతో టాప్ పొజిషన్ లో నిలిచారు. తాజాగా సిద్ధం చేసిన గృహ్ - హురున్ ఇండియా 2024లో దేశీయంగా టాప్ 100 మంది రియల్ ఎస్టేట్ శ్రీమంతుల జాబితాను వెల్లడించారు.

అగ్రస్థానంలో రాజీవ్ సింగ్ నిలిస్తే.. రెండో స్థానంలో మాక్రో టెక్ డెవలపర్స్ కు చెందిన మంగళ్ ప్రభాత్ లోధా.. ఆయన కుటుంబ సభ్యులుగా తేల్చారు. రూ.91,700 కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. దేశీయ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మూడో స్థానంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో అదానీ కుటుంబ సంపద విలువ రూ.56,500 కోట్లుగా వెల్లడైంది.

తాజా రిపోర్టు ప్రకారం తొలి వంద సంస్థల సంపద మొత్తం రూ.14.2 లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. ఈ మొత్తం ఒమన్ - శ్రీలంక దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. కంపెనీల పరంగా చూస్తే డీఎల్ఎఫ్ విలువ 72 శాతం పెరిగి రూ.2.02లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మ్యాక్రోటెక్ నిలిచింది. మూడో స్థానంలో తాజ్ గ్రూప్ కు చెందిన ఇండియన్ హోటల్స్ రూ.79,150 కోట్లతో నిలిచింది. తర్వాతి స్థానంలో గోద్రేజ్ ప్రోపర్టీస్ రూ.77,280 కోట్లు.. ఐదో స్థానంలో ఒబెరాయ్ రియాల్టీ రూ.66,200 కోట్లుగా నిలిచింది.

మొదటి ఐదు స్థానాల్లో ఉన్న వారి సంగతి ఇలా ఉంటే.. టాప్ టెన్ లో చివరిఐదు స్థానాల్లో ఉన్న వారిని చూస్తే..

ర్యాంక్ సంస్థ సంపద (రూ.కోట్లలో)

6 ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 63,980

7 అదానీ రియాల్టీ 56,500

8 ఫీనిక్స్ మిల్స్ 55,740

9 కే రహేజా గ్రూప్ 55,300

10 ఎంబసీ ఆఫీస్ పార్క్స్ 33,150

ఇక.. రియల్ ఎస్టేట్ సంస్థల జాబితా ఇలా ఉంటే.. దేశీయంగా కొన్ని కుటుంబాలు స్తిరాస్థిలో తిరుగులేని ముద్రను ప్రదర్శించారు. టాప్ 9 కుటుంబాలకు చెందిన వారి వివరాల్లోకి వెళితే..

ర్యాంకు ఫ్యామిలీ

1 రాజీవ్ సింగ్ (డీఎల్ఎఫ్)

2 లోధా (మాక్రోటెక్)

3 గౌతమ్ అదానీ (అదానీ రియాల్టీ)

4 వికాస్ ఒబెరాయ్ (ఒబెరాయ్ రియాల్టీ)

5 చండ్రురహేజా (కే రహేజా)

6 అతుల్ రుయా (ఫీనిక్స్ మిల్స్)

7 రాజా బాగ్ మానే (బాగ్ మానే డెవలపర్స్)

8 జితేంద్ర వీర్వాని (ఎంబసీ ఆఫీస్ పార్క్స్)

9 ఇర్ఫాన్ రిజ్వాన్, నోమాన్ రజాక్ (ప్రెస్టీజ్ ఎస్టేట్స్)

దేశీయంగా రియల్ ఎస్టేట్ సంస్థలు.. కుటుంబాల జోరు ఇలా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని స్తిరాస్థి సంస్థ మాటేమిటి? మనోళ్లు ఎక్కడ ఉన్నారన్న విషయానికి వస్తే..

- తెలుగు రాష్ట్రాల్లోని మహానగరమైన హైదరాబాద్ లో ఆరు దిగ్గజ స్తిరాస్థి కంపెనీల విలువ రూ.68,290 కోట్లు

- తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విలువ ఉన్న కంపెనీగా అపర్ణ కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ గా నిలుస్తోంది. దాని విలువ రూ.33,130 కోట్లు.

- దేశీయంగా చూస్తే.. పదకొండో స్థానంలో అపర్ణ సంస్థ నిలుస్తోంది.

- హైదరాబాద్ లో రెండో స్థానంలో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థగా ఎన్ సీసీ ఉండగా.. జాతీయ స్థాయిలో 20వ స్థానంలో నిలిచింది.

- అతిథ్య రంగానికి చెందిన జి.ఇందిరా క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలోని తాజ్ జీవీకే రూ.2050 కోట్లతో ఈ జాబితాలో 74వ స్థానంలో ఉంది.