Begin typing your search above and press return to search.

దేవినేని కోరిక తీరుస్తున్న చంద్ర‌బాబు.. సంచ‌ల‌న విష‌యం..!

చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో దేవినేని కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2024 2:30 PM GMT
దేవినేని కోరిక తీరుస్తున్న చంద్ర‌బాబు.. సంచ‌ల‌న విష‌యం..!
X

మాజీమంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు రాజ్య‌స‌భ సీటు క‌న్ఫ‌ర్మ్ అయిందా? పెద్ద‌ల స‌భ‌లోకి ఆయన అడుగు పెట్ట‌నున్నారా? ఇక‌, రాష్ట్ర రాజ‌కీయాల నుంచి ఆయ‌న‌కు ఢిల్లీ ఎలివేష‌న్ ల‌భించ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు. దేవినేని ఉమా.. ఆది నుంచి కూడా టీడీపీకి విధేయుడిగానే ఉన్నారు. చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో దేవినేని కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ‌తంలో దేవినేని ఉమా సోద‌రుడు వెంక‌ట ర‌మ‌ణ‌కు చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో విద్యాశాఖ ఇచ్చారు. అయితే.. న‌ర‌సాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందారు. అనంత‌రం.. 2014లో ఏర్ప‌డిన ప్ర‌భుత్వంలో దేవినేనిఉమాకు ఇరిగేష‌న్ శాఖ‌ను అప్ప‌గించారు. ఇలా.. చంద్ర‌బాబు ప్రాధాన్యం ఎప్పుడూ దేవినేని కుటుంబంపై ఉంటూనే ఉంది. అయితే.. ఈ సారి మాత్రం తాజా ఎన్నిక‌ల్లో దేవినేని ఉమాకు అస‌లు టికెట్ కూడా ఇవ్వ‌లేదు. రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాల‌తో వైసీపీ నుంచి వ‌చ్చిన వ‌సంత‌కు ఇచ్చారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. దేవినేనికి బ‌ల‌మైన పోస్టు ఇస్తార‌నే చ‌ర్చ సాగింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌నను ఎమ్మె ల్సీగా తీసుకుని మంత్రిని చేస్తారని కొంద‌రు.. కాదు.. నామినేటెడ్‌ప‌ద‌వుల్లో కీల‌క పోస్టును అప్ప‌గిస్తార‌ని మ‌రికొంద‌రు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ రెండు ప‌ద‌వులు కూడా.. దేవినేనికి ద‌క్క‌లేదు. కానీ, ఆయ‌నే వ‌ద్ద‌న్న‌ట్టు మ‌రో ప్ర‌చారం కూడా ఉంది. పార్ల‌మెంటుకు వెళ్లాల‌న్న త‌న కోరిక‌నుతీర్చుకునేందుకు ఆయ‌న రాజ్య‌స‌భ ప్ర‌తిపాద‌నను చంద్ర‌బాబు ముందు పెట్టార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మైన దేవినేని ఉమా.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టాల న్న‌ది కోరిక‌గా ఉంద‌ట‌. ఇక‌, చంద్ర‌బాబు కూడా.. మైల‌వరం రాజ‌కీయాల్లో రెండు అధికార‌కేంద్రాలు లేకుండా చూసుకుంటే త‌న‌కు కూడా త‌ల‌నొప్పులు త‌ప్పుతాయ‌న్న‌ది భావ‌న‌. అదేస‌మ‌యంలో త‌మ వాడు రాజ్య‌స‌భ‌లో ఉంటే తిరుగు ఉండ‌ద‌న్న అంచ‌నా కూడా ఉంది.

ఈ క్ర‌మంలోనే దేవినేనికి రాజ్య‌స‌భ సీటును ఇస్తున్నార‌న్న‌ది సీనియ‌ర్ నాయ‌కుడు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ఇచ్చారు. తాజాగా గ‌త రెండు రోజులునుంచి కూడా చంద్ర‌బాబు వెంటే ఉమా ఉండ‌డం.. ఆయ‌న‌తోచ‌ర్చ‌లుజ‌ర‌ప‌డం వంటివి ఈ వార్త‌ల‌కు బలాన్నిచేకూరుస్తున్నాయ‌నే చెప్పాలి.