రాజ్యసభలో ఉత్కంఠ..
అంటే 18 మంది ఎంపీల బలం ఎన్డీయేకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే ఇక్కడే వైసీపీ, బీజూ జనతాదళ్, టీడీపీ కీలకమయ్యాయి
By: Tupaki Desk | 4 Aug 2023 5:08 AM GMTఇపుడు అందరి దృష్టి రాజ్యసభ మీదే పడింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కబళించే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి బిల్లును నరేంద్రమోడీ ప్రభుత్వం లోక్ సభలో పాస్ చేయించేసుకుంది. శుక్రవారం ఇదే బిల్లును ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెడుతోంది.
బాగా మెజారిటి ఉంది కాబట్టి మూజు వాణి ఓటింగుతో గొడవల మధ్యే బిల్లును అధికార కూటమి నెగ్గించుకున్నది. అయితే రాజ్యసభలో ఎన్డీయే కూటమికి బలం లేదు. ఎన్డీయే బలం 110 మంది ఎంపీలైతే ఇండియా కూటమి, ప్రతిపక్షాల ఎంపీల బలం 128 మంది ఎంపీలు.
అంటే 18 మంది ఎంపీల బలం ఎన్డీయేకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే ఇక్కడే వైసీపీ, బీజూ జనతాదళ్, టీడీపీ కీలకమయ్యాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 17 మంది ఎంపీల బలముంది. నిజానికి ఈ రెండు పార్టీల బలాన్ని చూసుకునే నరేంద్రమోడీ బిల్లును రెడీ చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
రాజ్యసభలో ఎన్డీయే కూటమికే వైసీపీ మద్దతుగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే బీజూ జనతాదళ్ నిర్ణయమే ఇంకా సస్పెన్సులో ఉంది. నిజానికి ఈ బిల్లే అప్రజాస్వామికం అని చెప్పాలి.
ఢిల్లీ ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే మోడీ ఇలాంటి బిల్లును తయారు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కాదని లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ)ను అడ్డు పెట్టుకుని అధికారం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది మోడీ ఆలోచన. మూడుసార్లు వరుస ఎన్నికల్లో ఆప్ గెలవటం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవటాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకనే కేజ్రీవాల్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే మోడీ ఇలాంటి బిల్లు పట్టుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నా సరే లెక్కచేయకుండా ముందు ఆర్డినెన్సు తెచ్చి ఇపుడు ఏకంగా బిల్లునే ప్రవేశపెట్టేశారు. ఈరోజు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గుప్పిట పెట్టుకోవాలని అనుకున్న మోడీ రేపు ఇంకో ప్రభుత్వాన్ని కూడా అలాగే చేస్తారనటంలో సందేహంలేదు.
కాబట్టే ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాల్సిన బిల్లును ఎంపీల బలంతో మోడీ నెగ్గించుకుంటున్నారు. ఉభయసభల్లో ఏదో పద్దతిలో బిల్లును వ్యతిరేకించినా రేపటి ఎన్నికల్లో ఏమిచేస్తారు ? ఓట్లేయాల్సింది జనాలే కానీ రాజకీయపార్టీలు కాదుకదా.