హీరో నాగార్జునకు రాజ్యసభ సీటు కన్ ఫర్మ్...?
నాగార్జునకు ఎంపీ సీటు ఇస్తే 2024 మే లో ఏపీలో జరిగే ఎన్నికలో అయన సేవలు పూర్తిగా పార్టీకి ఉపయోగపడతాయని అంటున్నారు.
By: Tupaki Desk | 20 Sep 2023 1:30 PM GMTఅక్కినేని వారసుడు, కింగ్ గా పేరు గడించిన టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు పొలిటికల్ జాక్ పాట్ తగలనుందా అంటే అవునుని అనే ప్రచారం సాగుతోంది. నాగార్జున రాజకీయాలకు దూరంగా ఉన్నారా లేక దగ్గరగానా అంటే దానికి కూడా జవాబు సింపుల్ అంటున్నారు.
ఆయన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మాదిరిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అనే అంటారు. అదే టైం లో ఆయన అందరితో బాగానే ఉంటారు. వైసీపీతో ఇంకా సన్నిహితంగా ఉంటారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న మాట.
జగన్ సీఎం అయిన తరువాత అనేకసార్లు ఆయన వెళ్ళి కలుసుకున్నారు. దాని కంటే ముందు జగన్ జైలులో ఉన్నపుడు కూడా వెళ్ళి పరామర్శించిన హీరోగా నాగార్జున పేరు ఉంటుంది. అలా వైసీపీతో క్లోజ్ రిలేషన్స్ ని మెయిన్ టెయిన్ చేస్తూ వస్తున్న నాగార్జున విషయంలో వైసీపీ చాలానే హోప్స్ పెట్టుకుంది అని అంటున్నారు.
ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని కూడా చూస్తుంది అని ప్రచారంలో ఉన్న మాట. విజయవాడ లోక్ సభ సీటు నుంచి నాగార్జునను నిలబెట్టాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది అని ఇప్పటిదాకా వినవచ్చిన మాట. ఇపుడు దాని ప్లేస్ లో మరో కొత్త మాట వినిపిస్తోంది.
అదేంటి అంటే కింగ్ నాగార్జునకు రాజ్యసభ సీటు ఇస్తారని. ఆయన సేవలను పార్టీ కోసం మరికాస్తా గట్టిగా వాడుకుంటారని, వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏపీ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతాయని అంటున్నారు. అందులో ఒక సీటుని నాగార్జునకు ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు.
నిజానికి సినీ రంగానికి చెందిన వారికే ఈ సీటు రిజర్వ్ చేసి పెట్టారు అని కూడా ప్రచారం సాగింది. అది కూడా వైసీపీలో చాలా కాలంగా ఉన్న కమెడియన్ అలీకి ఇస్తారని ఇప్పటిదాకా అయితే అనుకున్నారు. కానీ టాలీవుడ్ కి చెందిన పెద్ద వ్యక్తికే ఈ ఎంపీ సీటు ఇస్తారని ఇపుడు మరో మాట వినిపిస్తోంది. ప్రముఖ నటుడిగా ఉన్న నాగార్జునకు ఈ సీటు ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నారుట.
నాగార్జునకు ఎంపీ సీటు ఇస్తే 2024 మే లో ఏపీలో జరిగే ఎన్నికలో అయన సేవలు పూర్తిగా పార్టీకి ఉపయోగపడతాయని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా కచ్చితంగా వైసీపీ వైపుగా టర్న్ అవుతారని, అలాగే న్యూట్రల్ జనాలలో సైతం నాగార్జున కదిలిక తేగలరని పార్టీ నమ్ముతోంది అంటున్నారు.
నాగార్జున ఇపుడు బిగ్ బాస్ వంటి అతి పెద్ద రియాలిటీ షోతో నేరుగా ప్రతీ ఇంట్లో అన్ని వర్గాలకు రీచ్ అయ్యారు. యూత్ లో ఆయనకు బాగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే లేడీస్ లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వీటిని గమనంలోకి తీసుకుంటే కనుక నాగార్జునకు రాజ్యసభ పదవి ఖాయమని అంటున్నారు.
దీని వల్ల వైసీపీకి చాలా లాభాలు ఉంటాయని అంటున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి ఇప్పటిదాకా గట్టి మద్దతు అయితే లేదు. దాంతో పాటు టాలీవుడ్ కి వైసీపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. దాన్ని ఈ దెబ్బతో తొలగించుకోవచ్చు అని ప్లాన్ వేస్తోంది అంటున్నారు
ఇక కమ్మ సామాజికవర్గానికి కూడా ప్రాధాన్యత వైసీపీలో ఇవ్వాలని భావిస్తున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన నాగార్జునకు ఎంపీ పదవి ఇవ్వడం ద్వారా ఆ క్యాస్ట్ లో కూడా వైసీపీ తన ఓటుని చోటుని మరింతగా పెంచుకుంటుంది అని అంటున్నారు ఏది ఏమైనా అన్నీ అనుకునట్లుగా జరిగితే నాగార్జున పెద్దల సభలో ఎంపీగా అడుగుపెడతారు అని అంటున్నారు.